|
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టేబుల్ మీద
ఆ పుస్తకం..
అందరి కళ్లు దానిపైనే!
----------
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టేబుల్ మీద
ఆ పుస్తకం.. అందరి కళ్లు దానిపైనే! /
Pawan Kalyan With Seshendra Sharma Book
-------
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బాధ్యతల్ని స్వీకరించారు. పవన్ ముందుగా కార్యాలయంలో పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టారు. అయితే పవన్ బాధ్యతలు చేపట్టే ముందు తన వెంట తెచ్చుకున్న ఓ బుక్ను ముందు టేబుల్పై పెట్టారు.. ఆ తర్వాతే ఫైల్స్పై సంతకాలు చేశారు. దీంతో అందరి కళ్లు ఆ టేబుల్పై ఉన్న బుక్వైపు వెళ్లాయి.
ఆ బుక్ గురించి ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టి.. కొన్ని ఫైల్స్పై సంతకాలు చేశారు. అనంతరం పార్టీల నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేయగా.. వరుసగా సమీక్షలతో బిజీ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో.. ఆయన టేబుల్పై ఓ బుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బుక్కు పవన్ ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారా అని చూస్తే.. అప్పుడు అసలు విషయం తెలిసింది.పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి పుస్తకాలు చదవడం, రచనలు అంటే చాలా ఇష్టం.. సాహిత్యంపై ఆసక్తి ఉందని చెబుతుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని పుస్తకాలన్ని ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ చదివారు. ఆయన ఎప్పుడో ఏదో ఒక పుస్తకాన్ని చదువుతుంటారని చెబుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్కు ఓ బుక్ అంటే మాత్రం చాలా ఇష్టమట.. ఆ పుస్తకాన్ని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా తన టేబుల్పై పెట్టుకున్నారు. ఆయనను ఇటీవల బాగా కదిలించిన గొప్ప పుస్తకం ఆధునిక మహాభారతం అని చెబుతుంటారు.తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించిన గుంటూరు శేషేంద్ర శర్మ ఈ ఆధునిక మహాభారతం పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పవన్ కళ్యాణ్పై అంత తీవ్ర ప్రభావం చూపించింది. ఆ బుక్ చదివినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా తన వెంటే తీసుకెళుతున్నారు. ఇవాళ కూడా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతూ ఆ బుక్ను తన పక్కనే టేబుల్పై ఉంచుకున్నారు. అంతేకాదు ఆ పుస్తకంలో కొన్ని పదాలను ఆయన రాశారు.. ఆ బుక్లోని 'ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు. నదులు, అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలతో చేసిన యువత' అంటూ రాసిన వాఖ్యాలను గుర్తు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గుంటూరు శేషేంద్ర శర్మను ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు.
మన దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి శేషేంద్ర శర్మ మాటలు.. తనను ఎంతో ప్రభావితం చేశాయి అంటుంటారు పవన్ కళ్యాణ్. అంేతకాదు ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ రీ పబ్లిష్ చేయించడం విశేషం.పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకు . శేషేంద్ర శర్మ గురించి ప్రస్తావనకు వచ్చింది. శేషేంద్ర శర్మ రచననలలో తను ప్రశ్నలకు సమాధానాలు కనిపించాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రజల కష్టాలు, ఇప్పటి జీవితాలు ఆయన రచనల్లో బాగా కనిపిస్తాయని.. దర్శకుడు త్రివిక్రమ్ తనకు ఆయన పుస్తకాలను పరిచయం చేశారన్నారు. ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని పాడైపోయే పరిస్థితిలో ఉన్నాయని తనకు తెలిసిందన్నారు. వాళ్ల అబ్బాయి దగ్గర ఓ పాత బుక్ ఉందని తెలిస్తే.. మాట్లాడి ఆ పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించినట్లు చెప్పారు. అంతటి గొప్ప కవి శేషేంద్ర శర్మను కొత్త తరానికి పరిచయం చేసే అవకాశం తనకు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటి తరానికి తెలియాలనే.. తాను రీ ప్రింట్ చేయించానన్నారు పవన్ కళ్యాణ్.గుంటూరు శేషేంద్రశర్మ గొప్ప తెలుగు కవి.. విమర్శకుడు, సాహితీవేత్త, వక్తగా ఉన్నారు. అలాగే ఆయన సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు. శేషేంద్ర శర్మ 1927 అక్టోబర్ 20న నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగరాజుపాడులో జన్మించారు. ఆయన ఏసీ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మద్రాసు లా కాలేజీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యారు.. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శేషేంద్ర శర్మ వచన కవిత్వం, పద్యరచనలో ప్రతిభావంతులు. ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ప్రత్యేకతగా చెబుతారు. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.. శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు కూడా చేశారు. 'నా దేశం-నా ప్రజలు' 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. భారత ప్రభుత్వం నుంచి ‘రాష్ట్రేంద్రు’ బిరుదు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందుకున్నారు
.https://telugu.samayam.com/తిరుమల బాబు
| Samayam Telugu19 Jun 2024 ///
--------
పవన్ కల్యాణ్ వెంటే శేషేంద్ర శర్మ పుస్తకం
---------
ABN , Publish Date - Jun 19 , 2024 | 12:56 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై రచనల ప్రభావం ఎక్కువే. ఆయన నచ్చేందే చేస్తారు. మెప్పు కోసం ప్రయత్నించారు. ఇష్టపడింది కష్టమైనా సాధించాలని అనుకుంటారు. ఒకరి పంథాలో వెళ్లరు. మన స్టైల్ మనదే అంటారు. ఒకరిలా బతకడం కాదు.. మనం మనలా బతకాలని అంటారు. పనిలో పులిలా ఉంటారు. ప్రైవసిని ఆశిస్తారు. స్టార్ హోదా పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతారు. వృత్తి, ప్రవృత్తిని సమానంగా ముందకు తీసుకెళుతున్నారు. అభిమానులనే కాదు జనంతో మమేకం అవుతారు. పవన్ కల్యాణ్లో ఓ విలక్షణ ఉంది. సాహిత్యంపై ఆసక్తి. ఆయనను కదిలించిన గొప్ప పుస్తకం ‘ఆధునిక మహాభారతం’.తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించిన గుంటూరు శేషేంద్ర శర్మ ఆ పుస్తకం రాశారు. కవిసేన మేనిఫెస్టే, కాలరేఖ వంటి సంచలన గ్రంథాలు కూడా ఆయన రాశారు. ఆధునిక మహాభారతం పుస్తకం పవన్ కల్యాణ్పై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ పుస్తకం చదివినప్పటి నుంచి తన వెంటే ఉంచుకుంటున్నారు. ఎక్కడికెళ్లిన తన వెంట తీసుకెళుతున్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను చేపట్టిన సమయంలో కూడా తన వద్ద పుస్తకం ఉంచుకున్నారు. ఆ పుస్తకంలో కొన్ని పదాలను పవన్ కల్యాణ్ రాశారు. ఒక ‘దేశపు సంపద ఖనిజాలు కాదు. నదులు, అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలతో చేసిన యువత. మన దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి శేషేంద్ర శర్మ మాటలు నన్ను అమితంగా ప్రభావితం చేశాయి అని’ పవన్ కల్యాణ్ రాశారు.
-----------
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ Seshendra: Visionary Poet of the Millennium |
|
జననం |
1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా |
మరణం |
2007 మే 30 (వయసు 79)హైదరాబాదు |
తండ్రి |
సుబ్రహ్మణ్య శర్మ |
తల్లి |
అమ్మాయమ్మ |
భార్య / |
జానకి |
పిల్లలు |
వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు) |
కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
-----------
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.comhttps://www.youtube.com/watch?v=F8TVwy_vh8Y&t=1s