Keep and Share logo     Log In  |  Mobile View  |  Help  
 
Visiting
 
Select a Color
   
 
KavirViswo Mahaa Tejaa : MahaKavi Seshendra Sata Jayanti Pratyeka Sanchika : 20 October 2026

Creation date: Oct 27, 2026 8:05pm     Last modified date: Oct 27, 2026 8:30pm   Last visit date: Nov 11, 2026 6:59pm
1 / 20 posts
Oct 27, 2026  ( 1 post )  
10/27/2026
8:05pm
Saatyaki S/o Seshendra Sharma (seshendra): edited 10/27/2026 8:12pm

photophotophotophotophotophotohttps://archive.org/details/seshendra-shata-jayanti-pratyeka-sanchikaమహా కవి శేషేంద్ర శతజయంతి

ప్రత్యేక సంచిక 

కవిర్విశ్వో మహాతేజా

భారతీయ సాహిత్య ధ్రువతార.  గుంటూరు శేషేంద్ర శర్మ.!!

ఈ ప్రత్యేక సంచిక శేషేంద్రకు నిజమైన నివాళి..

ఎ. రజాహుస్సేన్..!!

 

మహాకవి శేషేంద్ర శత జయంతి ప్రత్యేక సంచిక

కళాగౌతమి,తెలుగు భాషాభివృద్ధి మాసపత్రిక

(సంపటి 17-సంచిక 5 అక్టోబర్ 2026)

వ్యవస్థాపక సంపాదకులు  డా: బులుసు వేంకట  సత్యనారాయణ మూర్తి.

గుంటూరు శేషేంద్రశర్మ శతజయంతి(1927-2027)

 

సంవత్సరం సందర్భంగా శ్రీ కళాగౌతమి,తెలుగు… భాషాభివృద్ధి మాసపత్రిక

ఓ ప్రత్యేకసంచికనుసర్వాంగ సుందరంగా వెలువరించింది.. ఇందులో ప్రముఖ సాహితీ వేత్తల వ్యాసాలతో పాటు ఆయాసందర్భాల్లో కొన్నిపత్రికలు రాసిళ సంపాదకీయాలు, శేషేంద్ర కవితలు, శేషేంద్రగురించి రాసిన కవితలు, కొందరుసాహితీ వేత్తల అభిప్రాయాలూ వున్నాయి. శేషేంద్ర గురించి నేను రాసిన రెండు వ్యాసాలు కూడా వున్నాయి.శేషేంద్ర సాహితీ వైభవానికి ఓ విహంగావలోకనంగా ఈ ప్రత్యేక సంచికను రూపొందించిన శ్రీకళా గౌతమి మాస పత్రిక సంపాదకవర్గం, యాజమాన్యం అభినందనీయం.

1*

“ఓ శేషన్ నీ పాటకు రోజా ఒక పునర్జన్మ

నీ పాటకు జగమే ఒక రూపాంతర చేతన

ప్రేమే నీ మంత్రం..

హృదయం నీ పీఠం - ఓ శేషన్ నీవే ఒక

ప్రేమలోక దేవతవు

నీకోసం ఒక కోవెల నిర్మించాలనుకుంటే

చెట్టునాటి కొమ్మమీద కోకిల పెడితే చాలు”!!

*శేషం...విశేషం సంపాదకీయం. మూసీ సాహిత్య

సాంస్కృతిక పత్రిక..

2*

*యుగానికొక్కడు..

గగనానికి సాటి గగనమే! సాగరానికి సాటి సాగరమే! అన్నట్లు శేషేంద్రకు సాటి శేషేంద్రే! మరి యొకరు సరి

కారు. అతడొక యుగకవి! యుగద్రష్ట! అం దువల్ల అతని గురించి కానీ అతని సాహిత్యం గురించి కానీ, ముఖ్యంగా వారి 'కవిసేనఫెస్టో' గురించికానీ మాట్లా డం ఒక సాహసమే అవుతుంది.ఇకశేషేంద్రనులోకాని

కి పరిచయం చేయడమన్నా అంతే! ఒక చిట్టి దీపం వెలుగు ల్లో సూర్యుని చూపినట్లూ, ఒక గజం బద్దతో సముద్రాన్ని కొలువ జూచినట్లా అవుతుందది.అందు

వల్ల శేషేంద్ర మాటల్లోనే చెప్పాలంటే- 'వేదం మొదటి కవిత్వం' 'ఉపనిషత్తులు వచన కవితలు, ఇతిహాస పురాణాదులు బుర్రకథల్లాంటి లోకప్రియకవితలు' 'ప్రాచీన కవిత్వం శోకంలోనుంచి వస్తే,ఆధునిక కవి

త్వం క్రోధంలో నుంచి వస్తుంది'. 'అక్షరాల ఇసుకతో కవిత కట్టలేరు. జీవన మధూళితో తడపాలి 'కవి ఒక్కడే మానవ సమాజానికి ఏకైక నాయకుడు'అన్న వాక్యాలు మామూలు మాలు కావు. ఏ దివ్యలోకా ల్లోంచో దిగివచ్చిన తేజఃపుంజాల్లా కనిపిస్తాయేతప్ప,

ఏ మానవ మాత్రుడో గండూషించిన పడికట్టు మాటల్లా ఉండవు.

ఇవి శేషేంద్ర 'కవిసేన మేనిఫెస్టో'లోనివని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను. అందుకే, ఇవిఒకమహర్షి తన సమాధి స్థితిలో దర్శించుకొన్న దర్శనాల్లా… ఉంటాయి. అత్యద్భుతంగా ఉంటాయి.సాహితీసాగర మథనం లోంచి ఉద్భవించిన అమృతకలశంలోంచి నాల్కపై జారి పడే మధుబిందువుల్లా ఉంటాయి. నిజమే! కవిసేన మేనిఫెస్టో మనపాలిటి అమృత

కలశమే.”!!

3*

*గన్ను కృష్ణమూర్తి..!!

'సంప్రదించిన గ్రంథాలజాబితా'ను వీరు బహుశా చూచి ఉండరు. చూస్తే అలా మాటాడి ఉండరు. ముక్తా యింపు: మనకు 'కవిసేన మేనిఫెస్టో'ని చదివే ఓపికా అర్ధం చేసుకొనే ఓపికా, ఆచరించే ఔన్నత్యమూ లేవు. అందుకే మేకపోతు గాంభీర్యం'తో, అలా రాళ్ళని విసురుతూ పోతుంటాం! బురద చల్లుతూ పోతుంటాం! అంతే! రామాయణం భారత భాగవతాదులపై వేదాలపై రాళ్ళేసిన మహామహులు దీని పై వేయరూ? మళ్లీ చెబుతున్నాను ఇలాంటి ఆధునిక కావ్యశాస్త్రం ''నభూతో నభవిష్యతి' శేషేంద్ర స్వయంగా ఒక కవి. విమర్శకుడు. ఆపై పరిశోధకుడు. అంతే కాదు ఆధునిక కవిత్వానికి ఒక మార్గదర్శకుడు,

అందువల్ల ఈర్ష్యాద్వేషాన్ని ప్రక్కనెట్టి ఈ పుస్తకం ద్వారా కావ్యమర్మాన్ని తెలుసుకుందాం! ఆచరిద్దాం! మనల్ని మనం సరిదిద్దుకొందాం! ఒక నవ్య సాహిత్య జగత్తును నిర్మిద్దాం.

గన్ను కృష్ణమూర్తి,విద్వత్ కవి, సాహితీ మూర్తులు.!!

4*

★ఒక సాహిత్య యుగానికి శతాబ్ది..

తెలుగు సాహిత్య చరిత్రలో గుంటూరు శేషేంద్ర శర్మ ఒక విభిన్న ధ్రువతార. కవి,విమర్శకుడు,భాషాచింత

కుడు, రాజకీయ స్పందన కలిగిన సాహిత్యవేత్తగా ఆయన స్థానము ప్రత్యేకమైనది. 2026 సంవత్సరం మే 31 నుంచి శేషేంద్ర శతజయంతి ప్రారంభమవు

తుండగా, అదే సమయంలో ఆయన విప్లవాత్మక కావ్యం గొరిల్లాకు స్వర్ణోత్సవ కాలం కూడా రావడం ఒక చారిత్రక సందర్భం. తెలుగు సాహిత్యంలో తిరు

గుబాటు స్వరాలు, అత్యవసర పరిస్థితి పరిస్థితి.. (జుఎవతీస్తవఱఎఎ) వ్యతిరేక భావజాలం, వ్యవస్థపై సాహిత్య నిరసన, ఈ మూడింటినీ ఒకే వ్యక్తిత్వంలో మిళితం చేసిన అరుదైన కవి శేషేంద్ర.

"కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగ

రుంది": కనుకనే ఎర్రరంగులో అండర్లైన్ చేయవల

సిన పంక్తి.ఈ ఒక్క పంక్తి శేషేంద్ర సాహిత్య తత్వాన్ని మొత్తం చెప్పేస్తుంది. అందుకే శేషేంద్రను మహాకవి అని ఊరికే అనడం లేదు.ఆయన దృష్టిలో: కవి కలం

ఒక ఆయుధం,రచన ఒక రాజకీయ ప్రకటన,కవిత్వం

ఒక జెండా. ఇది కేవలం భావుకత కాదు; సాహిత్య ప్రతిఘటన.

*ఆచార్య మాడభూషి శ్రీధర్,

న్యాయశాస్త్ర నిపుణులు

5*

*స్వదేశీ మార్క్సిస్టు “ కవి.గుంటూరు శేషేంద్ర శర్మ !!

మార్క్సిస్టు కవుల్లో కూడా స్వదేశీ,విదేశీ అని వుంటారా? అసలు మార్క్సిజమే మనది కానప్పుడు“స్వదేశీ మార్క్సిజమ్ “ అనడంలో ఔచిత్యముందా?ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే.అయితే ప్రపంచ వ్యాప్తంగా మార్క్సిజమ్ ప్రభావంతోసామాజిక,ఆర్థిక, రాజకీయ విప్లవాలు తలెత్తాయి.వీటి ఛాయలు మనదేశంపై కూడావపడ్డాయి.సామ్యవాదం సామాన్యుడి వేదం అయినపుడు సమాజంలోని కవులు కూడా ఈ ప్రభావానికిలోనుగాక తప్పలేదు.అయితే కొందరు కవులు మార్క్సిజాన్ని పూర్తిగా ఒంటికి పూసుకొని విప్లవకవులుగా చెలామణీ అయితే,మరి కొందరు సామ్యవాదాన్ని రేఖామాత్ర స్ఫూర్తిగా తీసుకొని కవిత్వంరాశారు!ఇందులో మొదటి కోవకు చెందిన వారిని విదేశీ మార్క్సిస్టు కవులుగా,రెండో కోవకు చెందినవారిని స్వదేశీ మార్క్సిస్టు కవులుగా భావించవచ్చు.శ్రీశ్రీ లాంటి కవులు మొదటి కోవకు చెందుతారు.

కాగా గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి వారు రెండో కోవకు చెందుతారు.వీరిద్దరు రాసింది అభ్యుదయవిప్లవ కవిత్వాలే.ఇరువురి కవిత్వంలో కూడా విప్లవ చైతన్యమే ప్రధాన వస్తువు.అయితే శ్రీశ్రీ కవిత్వానికివచ్చిన ప్రచారం శేషేంద్ర కవిత్వానికి రాలేదు!

ముఖ్యంగా వీరిద్దరూ వచన కవిత్వమే రాసినా,శ్రీ శ్రీ గేయ,లయాత్మక శైలిని అనుసరించగా ,శేషేంద్ర శుద్ధ వచనంలో తనదైన ప్రత్యేక పంథాను ఎంచుకున్నా

డు.శేషేంద్ర వచనం చూడ్డానికి వాక్యాల తోరణంలా వుంటుంది.వాటిని విరగ్గొడితే , శ్రీ శ్రీ గేయ,లయాత్మక శైలిలా వుంటాయి.కానీ,శేషేంద్రఉద్దేశపూర్వకంగానే గేయానికి,లయకు ప్రాణమైన మాత్రాఛందస్సుల్ని పరిహరించాడు.వచనాన్ని రసాత్మక వాక్యంగా మలిచాడు.ప్రక్రియ,పద్ధతి,శైలి ఏదైనా అందులో కవిత్వం మాత్రం ఖచ్చితంగా వుండాలనే తత్వం శేషేంద్రగారిది.కవిత్వారంభంలో శేషేంద్ర సమకాలికుల శైలికి ఆకర్షితుడైవుండొచ్చు గానీ,ఆతర్వాత మాత్రం తనదైన “రాస్తా “ ను మాత్రంప్రత్యేకంగా వేసుకున్నాడు.శ్రీశ్రీ లాంటి యుగకవి ప్రభావం నుండి బయటపడి సొంత మార్గాన్ని ఏర్పరుచుకోవడం చిన్న విషయం కాదు.శేషేంద్ర ఇందుకు మినహాయింపని రుజువు చేసుకున్నాడు.

*ఎ. రజాహుస్సేన్..!!

6*

బహుశా మన విమర్శకులకు శేషేంద్ర కవిత్వంలోని ఇంద్రజాలం కనబడకపోయి వుండొచ్చు. శేషేంద్ర శ్రామిక శక్తికి ఇచ్చినంత ప్రాధాన్యత మరోదానికివ్వలేదు. 'శ్రమ యేవ జయతే' అన్న ఆర్యోక్తి ప్రకారం శ్రమలేకపోతే జయమే కాదు జీవితం కూడా లేదని చెప్పాడు శేషేంద్ర.

"నేను జేబుల్లో కోకిలల్ని వేసుకురాలేదు. పిడికిళ్లలో బాంబులు బిగించుకుని వచ్చాను ఏవో నక్షత్రాలు కొన్నికలలై నావేళ్లమీద వాలుతున్నాయి. కొన్న అప్సరసలై కన్నులమీద రాలుతున్నాయి. నేను మోకరించి ప్రార్థిస్తున్నాను.

ఓజిందగీ, నన్ను సుఖంమీద శిలువ వెయ్యకు".

శ్రీశ్రీ కవిత్వం పాశ్చాత్య ధోరణులకు పాశ్చాత్యరచయితల భావాలకు దగ్గరగా వుంటే శేషేంద్ర కవిత్వం వాటికి అందనంత" దూరంలో వుంది. కమ్యూనిస్టు మ్యానిఫెస్టోలోని మౌలిక సూత్రం ఆధారంగా శ్రీశ్రీ

"పరస్పరం సంఘర్షించిన

శక్తులలో చరిత్ర పుట్టెను" అంటాడు.

దాదాపు ఇటువంటి భావాన్నే తనదైన రీతిలో చెబుతాడు శేషేంద్ర “చెట్లకు వ్రేలాడిన శిరసులు పూస్తున్నాయ్ కొమ్మల్లో పూర్తై గోలీదూరిన గుండెలు కదులుతున్నాయ్ గుడిలో గంటలై ఎందరు ఎన్ని రాత్రులు రక్తంపిండి ఇచ్చారో ఈ దినంకోసం"

శేషేంద్రశర్మ ఒక వ్యక్తి కాదు. ఆయన స్పందించే బిందువు, అందుకే శ్రీశ్రీ శేషేంద్రనుద్దేశించి "నీ కవిత్వంలో రసాన్ని క బంగారం చెయ్యడం కోసం తడవులాట కనిపిస్తుందంటాడు.

శేషేంద్రకు దేశంపట్ల ముఖ్యంగా మనుషులు వారి శ్రమశక్తి పట్ల ఎంతో అభిమానం వుంది. కర్షక కార్యకర్త ఈ దేశాన్ని ఏలా శ్రమశక్తే దేశ భవిష్యత్తుకు మూలం అంటాడు శేషేంద్ర. స్వదేశీ మార్పిజానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు.

"నీకు తిండిగింజలు ఎలావస్తున్నాయో తెలుసాఈనేల ఎవరు దున్నుతున్నారో తెలుసా ప్రాణదాన, సాధన, ఈనాగలి ఎవ చేస్తున్నారో తెలుసా!

మట్టిశక్తి అవగాహన చేసుకో బిడ్డా"

 

7*

*రామాయణ పరామార్ధమే యోగ సాధన !

శేషేంద్ర “ షోడశి “ నిర్ధారణ !

ఈనాడు విభిన్న దేశాలను ఏకం చేస్తూ విశ్వసంచారం చేస్తున్న యోగ భారతదేశంలోనే ఉద్భవించింది. ప్రపంచ మానవా శారీరక మానసిక ఆరోగ్యపరిరక్షణకై యోగా ఉద్యమించింది. ఇంతటి విశ్వజనీనమైన యోగాకు అగ్రాసనం వేయడా రామాయణ రచనలో విశ్వకవి వాల్మీకి అంతరంగమని శేషేంద్ర నిర్ద్వంద్వంగా ప్రకటించారు తమ "షోడశి" గ్రంథంలో.

మానవ శరీరంలో నిద్రాణమై షఉండే శక్తిని యోగ సాధన ద్వారా జాగృతం చేసే కుండలినీ యోగ విద్యను ప్రత్యక్షం పరోక్షంగా, ఆలంకారికంగా,ధ్వనిగర్భితంగా రామాయణ కథాంశంలో వాల్మీకి మహర్షి పొందుపరచిన రహసా శేషేంద్ర ఈ గ్రంథంలో సోదాహరణంగా సాధికారికంగా ఆవిష్కరించారు. ఈ కుండలినీ యోగంలో అధిష్టాన దె అయిన లలితా పరమేశ్వరి లేదా పార్వతి అమ్మవారికి మరో పేరే “ షోడశి “.!!

*డా. వెనిగళ్ళ రాంబాబు

సినీగేయరచయిత..

8*

కవిత్వానికి దిక్సూచి.."కవిసేన మేనిఫెస్టో”

కవిత్వ నిర్వచనాలకు కొత్త సిలబస్..!!

"ఓనా ప్రజలారా!

రండి మీకో కొత్త పద్యం ఇస్తా

ఈ పద్యం మీకో కొత్త ప్రాణం ఇస్తుంది.

కొత్త ప్రయాణం ఇస్తుంది".

మహాకవి శేషేంద్ర తమ కవిత్వం ద్వార ప్రపంచానికి చేసిన ప్రమాణం ఇది. కవిగా తన ప్రయాణంలో ప్రజలకిచ్చిన నైతిక మద్దతు ఇది.కాలంఏదైనాకానిచేయాల్సిన పని ఒక్కటే! కలాన్ని పదునెక్కించి,కాలంవెంటనడవడమే! కాలాతీత కాంతిరేఖగా జీవించడమే!

అన్ని తరాలను ప్రభావితం చేసే కవిత్వంగా బతకడమే!

మహాకవి శేషేంద్ర అనన్య సామాన్యమైన శబ్దంసృష్టించిన వతాబ్దాన్ని వెలిగించారు. మండే సూర్యుడై కొత్త వెలుగునిచ్చారు.. రుతుఘోషను విన్పించారు.యుగస్వభావాన్ని తమ కవిత్వంలోప్రతిఫలింపచేసి"యుగకవి"గా నిలిచారు.పాతవాసనగొట్టేపదాల్నివదిలేసి,.సజీవమైన ప్రజల భాషలో కవిత్వానికి ప్రతిష్టచేశారు.కవిగా ఆరు దశాబ్దాల అనుభవంతో,ప్రాచీన,అర్వాచీన సాహిత్యాన్ని సమగ్రంగా చదివిన పాటవంతో,భారతీయ, పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను అవగతం చేసుకున్న నేపథ్యంలో సరికొత్త కవిత్వ సిద్ధాంతాన్ని లోకానికి అందించాలన్న ఆలోచననుండి పుట్టిందే.. 'కవిసేన మేనిఫెస్టో', 'కవిసేన' ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక సమగ్రలాక్షణిక గ్రంథం, రచన.!!

* డా॥ బీరం సుందరరావు

9*

నాన్న శేషేంద్ర శర్మ ఒకే ఒక్క సినిమా పాట కథ

చిత్రం - ముత్యాల ముగ్గు (1975) సంగీతం కె.వి. మహదేవన్.గీతరచన - గుంటూరు శేషేంద్ర శర్మ గానం P. సుశీల.

1974 అక్టోబరు ప్రాంతంలో బాపు, రమణ,ముత్యా

ల ముగ్గు నిర్మాత సుకుమార్, ఆ సినిమాకు నిర్మా

తగా వ్యవహరించిన ఎంవియల్ వెళ్ళి గ్యాన్బాగ్ ప్యాలస్ లో సినిమా షూటింగ్ కావాలని అడిగారు. నాన్న చేత పాటలు రాయించాలని ఇందిరా ధన్రాజ్గర్ అడిగింది. పాటల రికార్డింగ్ పూర్తయ్యిందని, ఒక్క పాట ఇవ్వడానికి ప్రయత్నిస్తామనీ, ముందుతీయబో

యే । సినిమాల్లో ఎక్కువ పాటలు రాయిస్తామనీ.. వాళ్ళన్నారు. ఆ ఒక్క పాట రాయడానికి మద్రాస్ రమ్మన్నారు. 1974 డిసంబర్ ఆఖరి వారంలో మద్రా

స్ వెళ్ళాడు. రెండు రోజుల్లో తిరిగొస్తానని వెళ్ళిన మనిషి జనవరి 1975 మొదటి వారంలో తిరిగొచ్చాడు. సంగతేమిటంటే మద్రాస్ చేరుకోగానే శ్రీలంకకు సంబంధించిన వైరల్ జ్వరం వచ్చిందట. 104, 105 డిగ్రీలు ఉండే దట. సినిమా వాళ్ళు ఎవరో డాక్టర్ని సవేరా హోటల్కు తీసుకొచ్చి ఇంజక్షన్లు పొడిపించారట. ఆ జ్వరంలోనే పాట రాశాడు. ఈ పాట అప్పుడు ఆ సినిమా కోసం రాసింది. అందులో ఒక్కముక్కయినా అంతకు పూర్వం లేదు.సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ హోటల్కు తీసుకువచ్చారట. పాటలో మార్పులు ఏమయినా చేయాలా అని నాన్న ఆయన్ని అడిగాడట. పాటలోనేరాగంఉందని, దాన్ని ఉన్నది ఉన్నట్టుపాడించేయడమేననీరికార్డింగ్ కి ఉండనవసరంలేదని మహదేవన్ చెప్పా

డట. హైదరాబాద్ తిరిగొచ్చేశాడు.ఫిబ్రవరిలోషూటింగ్ కోసం హైదరాబాద్ వస్తూ వస్తూ రికార్డ్ చేసినపాటను వాళ్ళు తెచ్చి వినిపించారు. నాకు గుర్తున్నంత వరకూ గోదావరి ప్రాంతంలో ఆ పాట షూటింగ్ అప్పుడు నాన్న రాజమండ్రి ఏప్రిల్ నెలలో వెళ్ళాడు. చివరకు సినిమాలో కూడా పాట ఉంది. 1975 లోనే హైదరాబాద్ సుదర్శన్ టాకీస్ లో జరిగిన. శతదినో

త్సవాన్నికి నాన్నను పిలిచారు వేదిక మీద అక్కినేని నాగేశ్వరరావుతో జ్ఞాపిక ఇప్పించారు సీతాకళ్యాణంలో మూడు పాటలు రాయిస్తామన్నారు. చివరకు రెండన్నారు. తీరా మద్రాస్ చేరుకున్నాకఒకటన్నారు. చివరికి ఆ ఒకటి కూడా తీసేశారు. 1976 జనవరి మొదటి వారం లో వాళ్ళు పిలవగా మద్రాస్ వెళ్ళాడు. చివరకు ఒక పాట రాయమన్నారు. సీత బాల్య క్రీడల పాట రాయమన్నారు రాసి ఇచ్చిహైదరాబాద్ తిరిగి వచ్చ్చేసాడు.

*సాత్యకి

S/o గుంటూరు శేషేంద్ర శర్మ

10*

చెప్పవచ్చు. ఈ విధంగా చాటడానికి ఏ మాత్రం సందేహించ నవసరం లేదు.

నిజానికి ఈయనికి "జ్ఞానపీఠం" అవార్డు ఎప్పుడో రావలిసింది. అయితే అంతకంటే కూడా మరొక ఉన్నతమైన అవార్డు ఏదైనా వుంటే ఆ అవార్డుని అందుకోవడానికి శ్రీ శేషేంద్ర కవిగా అన్ని విధాలా అర్హుడని నేను నమ్ముతాను.

*ఒక సమాంతర స్వాప్నికుడు.. శేషేంద్ర..1970 తర్వాత విప్లవ భావజాలం తెలుగు సాహి

త్యంలో ఒక ప్రధాన స్రవంతిగా మారింది. కవిత్వం స్వభావం వున్నట్టుండి మారిపోయింది. అది పాటలోకి ఇంకిపోయే ప్రయత్నం చేస్తోంది.మధ్యతరగతిలోచి అట్టడుగువర్గంలోకి 'డీక్లాసిఫై' (చూడుడు- చలసాని ప్రసాదరావు' ఇలా మిగిలేం') అవ్వడానికి సాహిత్యలోకం సన్నద్ధమవుతున్న దశ. కథలు మాండలికంలోకీ, వచన కవిత్వం జానపదబాణీల్లోకి వలసపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇంకోవైపు వచన కవిత్వంలో ముక్కుసూటిగా వేలెత్తి చూపుతున్నంత స్పష్టంగా వ్యక్తీకరణ మారుతోంది. ఈ వ్యక్తీకరణ ఎంత దూరం వెళ్లిందంటే - ఒక దశలో ఎంత మొరటుగా మాట్లాడితే అంత విప్లవకవిత్వం అనే స్థాయి ఏర్పడింది. కచ్చితంగా ఈ మలుపులో నిలబడి వచన కవిత్వం డైరెక్షన్ మార్చినవాడు శేషేంద్ర.

మొదటి గేయం 'విశాలాంధ్ర'లో అచ్చయినప్పటి నుంచీ ఇటీవలి కవితల వరకూ శేషేంద్ర డైరెక్షన్ వొక్కటే. కవిత్వంలో ఆయన స్వరతీవ్రత తగ్గలేదు. విమర్శలో ఆయన పదునూ తగ్గలేదు. వస్తువు.. పరంగా ఏకోన్ముఖంగా సాగిన శేషేంద్ర కవిత్వంలో రూపం మాత్రం భిన్నత్వాన్ని సంతరించుకుంది. తనకు వివిధ భాషాసాహిత్య సంస్కృతులతో వున్న గాఢమైన అనుబంధం వల్ల శేషేంద్ర కవితకు వొక వినూత్న సౌదర్యం అబ్బింది. 'నీది మంచి పద్యమా లేక ఫ్రెంచి మద్యమా' అని శ్రీ శ్రీ ఇచ్చిన కితాబు శేషేన్ పోయెమికి వర్తించేదే. ఎందుకంటే తన మీద బాద్లోర్, మల్లార్మేలాంటి కవుల ప్రభావం వుండడం శేషేంద్రకూ ఇష్టమే. కవిత్వతత్వంలో శేషేంద్ర అభిరుచికీ, ఆ కవుల సంస్కారానికీ సాన్నిహిత్యం వుంది. అలాగే, అభ్యుదయభావనకి కవిత్వకాల్పనికతని అద్దిన ఫైజ్ లాంటి కవులు శేషేంద్రకి వ్యక్తిగతంగా కూడా సన్నిహితులు. ఇక జీవన సౌందర్యాన్ని గొప్పగా ప్రేమించిన గ్రీకు, జర్మనీ సాహిత్యవేత్తలతోనూ, చిత్రకారులతోనూ శేషేంద్రకి ఎల్లలు అడ్డురాని అనుబంధం వుంది. తెలుగులో విప్లవ కవిత్వానికి సమాంతరంగా వొక కవిసేనని తరలించిన యోధుడు శేషేంద్ర.కవిత్వరచనకీ,కవిత్వ పఠనానికీ తనదైన ఒరవడిని ఏర్పర్చుకుని సమకాలీన కవుల కాల్పనిక లోకాన్ని మార్చినవాడు శేషేంద్ర. 75 తర్వాత శేషేంద్ర కవిత్వాన్ని చదవనివాడు ఇంకామిగిలివున్నాడంటే వాడు సగం కవిత్వచరిత్రనిమిస్సయినట్టే" అనేవాడు వ్యాసాల్లో ఆయన తాత్విక… సారాంశం అర్థమవుతుంది. నిజమైన కవి కలకీ,వాస్తవికతీ మధ్య సరిహద్దు రేఖలో కనిపిస్తాడు. నేటికీ రేపటికీ మధ్య మెరిసిన సాంధ్యరాగంలోపలకరిస్తా

డు. శేషేంద్ర చిరునామా కూడా అదే!

*అఫ్సర్..!!

11*

ఆయన 'కాలరేఖ' ఈ సారి కేంద్రీయ సాహిత్య అకాడమీవారి అవార్డు అందుకుంది. ముప్పయి ఏళ్ళక్రిద రావలసిన అవార్డు ఈనాటి కొచ్చింది. అందువల్ల అదేమంత గొప్ప విషయంగా నేను భావించడం లేదు. పై పై మాటలు ఏవో నాలుగు మాటలు చెప్పాను. చెప్పగల సామర్థ్యం నాకు లేదు, చెప్పగల మహానుభావులెందరో ఉన్నారు, వారు చెప్తారు. ఉండేల విజ్ఞాన కళా పీఠాన్ని నెలకొల్పి, మొదటిసారి శేషేంద్ర విశ్వకవీంద్రుని బహూకరించినందుకు అందరితర

పునా మాలకొండా రెడ్డిగారిని అభినందిస్తున్నాను. శేషేంద్ర ఇంకా ఎన్నెన్నో సార్థక రచనలు, కవితలు చేస్తారని ఆశిస్తూ ఈ ప్రసంగం విరమిస్తున్నాను -

(జప్టిస్ ఒ. చిన్నపరెడ్డి (సుప్రీంకోర్టు)

హైదరాబాదు.23-8-1995

12*

గురజాడ తోడు శేషేంద్ర!!

యుగకర్త గురజాడ తర్వాత తెలుగు సాహిత్యంలో ఆ యుగకర్తృత్వాన్ని ముందుకు ఒక మెట్టు

పైకి తీసుకువెళ్ళిన ఖ్యాతి జేషేంద్ర. 1996 సంవత్సరం గురజాడ అవార్డుని ఆయనకు అందజేయడంలో ఎంతో ఔచిత్యం ఉంది.తెలుగు సాహాత్యంలో రూసో నవ్య మానవతా వాదాన్ని ప్రవేశ పెట్టినవాడు గురజాడ. ఇది ఆనాటి కాల్పనిక వాదంలో "న్నమూ, విశిష్టమూ అయిన మార్గం. ఈ మార్గంలో మారిజమ్ వక్రీకరణ కొన్ని దశబ్దాలు తన ప్రభావం చూపింది. ఆ -క్రీకరణను సరిదిద్ది కొత్తబాటలు వేసిన శేషేంద్ర మండే సూర్యుడు, నా దేశం నా ప్రజలు, గొరిల్లావంటి రచనల్లో అప్లవభాషా విధాత' అయ్యాడు. గురజాడ గేయాన్ని దిద్దితే, శేషేంద్ర వచన కవిత్వానికి కొత్త ఆకృతినే గాక వస్తువు రీత్యా 'త్న జవసత్వాలను చేకూర్చాడు

*ఆర్.ఎస్.సుదర్శనం!!

ఈ ప్రత్యేక సంచిక శేషేంద్రకు నిజమైన నివాళి..

*ఎ. రజాహుస్సేన్..!!

 

 

 

------------

వైభవంగా గుంటూరు శేషేంద్ర శర్మ

శతజయంతి ప్రారంభ సభ.!!

 

పాతచెట్టు కూడా కొత్త పూలు పూసినట్టు.శేషేంద్ర శర్మ కవిత్వం నేటికీ పరిమళం వెదజల్లుతోంది..‌!! శేషేంద్ర శర్మ శతజయంతి సంవత్సరంప్రారంభంసందర్భంగా అక్టోబర్ 22న సా.6.00 గంటలకు హైదరాబాద్,రవీంద్రభారతి,మినీహాలులులో జరిగినసభఆద్యం తం శేషేంద్ర జీవితం,సాహిత్య పరిమళాలను వెదజల్లింది. సభకు అధ్యక్షతవహించిన నందిని సిధారెడ్డి‌ మాట్లాడుతూ శేషేంద్ర కావ్యాలు ‌ ప్రపంచ పరిణామాలకు.నిదర్శనమన్నారు.ఆరోజుల్లో యువకవులంతాశేషేంద్ర లా కవిత్వంరాయాలని‌ ఉవ్విళ్ళూరేవాళ్ళన్నారు శేషేంద్ర ఎప్పుడూ శాస్త్రానికి దాస్యం..చేయ

లేదన్నారు‌.కవిత్వం నీరస పడినప్పుడు శేషేంద్ర కాలంఝళిపించాడు.కవిత్వ ప్రేమికుడు,కవిత్వం పట్ల ఆయనకమిట్ మెంట్ గొప్పది..ఆయన బాల్యంలో కొన్నేళ్ళపాటు సముద్రాన్ని చూసి గడిపాడు.‌వేదం చదువుకున్నశేషేంద్ర తర్వాత కమ్యూనిస్టుగా మారాడు‌మఖ్దూంమొహిద్దిన్ కు ఆయన సన్నిహితుడన్నారు.ఆయన ఎక్కడున్నా.సామాన్యుల పట్ల సానుభూతిగా వుండేవాడనిచెప్పారు.మనకందే దేవత నాగలి.వంటి గొప్ప వ్యక్తీకరణలు చేశారన్నారు..ఆయనరాసిన తెలంగాణను ప్రస్తావిస్తూసామాన్య జనుల పట్ల ఆయన అంకితభావం మరువలేనిదన్నారు.. ఆధునికతేకాదుపాశ్చాత్యకవిత్వాన్ని కూడా అధ్యయనం చేశారని తెలిపారు.పుస్తకాలతో మనిషి పశుత్వానికి ఆనకట్టలు కట్టిన మహాకవిశేషేంద్ర అన్నారు.పీపుల్స్ వార్ మీదున్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వానికిచ్చిన వినతిపత్రం మీదసంతకం చేశారన్నారు‌.‌చిత్రమేమంటే.అప్పటికి ఆయన ప్రభుత్వ సర్వీసులో వున్నారన్నారు..!తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ..సాహిత్య..నేపథ్యంవున్న కుటుంబం నుంచి వచ్చిన శేషేంద్ర ఎప్పుడూ రాజీపడి లేదన్నారు.ప్రభుత్వ ఉద్యోగంలో వున్నా సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్నివిమర్శించడానికి వెనుకాడలేదన్నారు.శేషేంద్ర ఒకవిలక్షణమైన వ్యక్తి..కవి,ఉద్యమకారుడు,విమర్శకుడు, అలంకారికుడు, తాత్విక వేత్త అన్నారు.శేషేంద్ర భావుకత,అభివ్యక్తి ప్రత్యేకమైందన్నారు.కవిసేన ..మ్యానిఫెస్టోలో కవిత్వం గురించి ఆయనచెప్పినఅభి మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ..ధైర్యమున్నవాడే‌కవి అవుతాడు‌‌.శేషేంద్ర శర్మ ధైర్యమున్న కవి అన్నారు.. శేషేంద్ర లాంటి కవులుండటం మన అదృష్టం

అన్నారు సాహితీ విమర్శకులు ఎ.రజాహుస్సేన్ మాట్లాడుతూ శత వసంతుడు శేషేంద్ర అన్నారు..వసంతం అంటేకోకిలల పాఠశాలపక్షుల సంగీత అకాడమీఒక్కోపక్షి వెయ్యేసి పాటలుగా రూపాతరం పొందే రుతువు..శేషేంద్రకూడా ఓ వసంత రుతువు అన్నారు.‌శేషేంద్ర కవే కాదు, ద్రష్ట కూడాశ్రీశ్రీ సమాజాన్ని చూశాడు,..శేషేంద్ర కాలాన్ని చూశాడు. శ్రీశ్రీ మరో ప్రపంచం.. కోసం పిలిచాడు,శేషేంద్ర `మనిషికోల్పోయినముఖంకోసం తవ్వాడు.అందుకేఆయనను’యుగకవి`అన్నారు. ఒక యుగానికి ఒకే ఒక్కడు ఉంటాడు శేషేంద్రఅని చెప్పారు..ఎన్ని వున్నా..సుమారు 50 పుస్తకాలదాకా రాసినాశేషేంద్ర కు రావాల్సిన గుర్తింపు,‌ దక్కాల్సిన గౌరవందక్కలేదేమో అనిపిస్తుంది..అయినా.. ప్రజలు ఆయనను యుగకవిగా భావించారు.అలాగే పిలుచుకున్నారు.‌శేషేంద్రకు చాలాకాలానికి“కాలరేఖ” విమర్శకుకేంద్రసాహిత్య అకాడమీ వారు పురస్కారం అందజేశారు.అకాడెమీ వారి దృష్టిలో శేషేంద్రకవిత్వంలేదు..కవిగా ఆయన్ను  అకాడెమీగుర్తించలేదన్నారు.

తండ్రి శతజయంతి నిర్వహిస్తున్న సాత్యకి అభినందనీయుడన్నారు.సినీ రచయిత వెనిగళ్ళ రాంబాబు మాట్లాడుతూ..సాత్యకి లాంటి కొడుకు వుండటం శేషేంద్ర అదృష్టఅన్నారు.నాకున్న పుత్రుండు.నాకున్ తండ్రి”అంటూశేషేంద్ర సాత్యకిని దీవించారన్నారు.శేషేంద్రసాహిత్యంచిరస్థాయిగా వుంటుందన్నారు‌.“శేషేంద్ర ఆధునిక మహాభారతం..కవిత్వ‌ తాత్విక దర్శనం” పుస్తక రచయిత సబ్బని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేను శేషేంద్రగారితో నడిచినప్పుడు.సముద్రంతోనడిచినట్టుందన్నారు.ఆయనను ఇంటర్వూ చేసినపుడు నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారన్నారు.శేషేంద్ర శర్మ శతజయంతి ఉత్సవాల‌ కన్వీనర్ అతిధులకు , సభికులకు కృతజ్ఞతలు తెలిపారు..!ఈరోజు సమాజంలోని రుగ్మతలు, నేరస్తులున్నట్లేసాహితిలోకంలో కూడా తయారయ్యారన్నారు.ఈ సభ తనకు జీవన సాఫల్య పురస్కారం లాంటిదన్నారు.!!సంకేపల్లి నాగేంద్ర శర్మ ప్రభృతులు మాట్లాడారు..ఈ సందర్భంగా ప్రచురించిన శేషేంద్ర శతజయంతి సంవత్సర ప్రారంభ సంచికను మాడభూషి శ్రీధర్ ప్రారంభించారు.సబ్బని లక్ష్మీనారాయణ గారు రచించిన శేషేంద్ర ఆధునిక మహాభారతం..కవిత్వ‌ తాత్విక దర్శనం.అనే పుస్తకాన్ని ఏనుగు నరసింహారెడ్డి… ఆవిష్కరించారు.సభ ప్రారంభంలో అతిథులు జ్యోతిప్రజ్వలనచేసి, శేషేంద్ర శర్మ గారికి నివాళులు అర్పించారు.సభలో శేషేంద్ర సాహిత్య పరిమళాలు గుబాళించాయి.

 

ఎ.రజాహుస్సేన్‌

హైదరాబాద్…!!

-------------                                                        

 -----------  

శేషేంద్ర శర్మ

(20-10-1927 - 30-5-2007)

సంస్మరణ

ప్రముఖ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ (79) మే 30 రాత్రి మరణించారు. ఆయన 1927లో నెల్లూరులో తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ పనిచేశారు. 'నా దేశం నా (ప్రజలు' ‘శేషజ్యోత్స్న’, ‘రక్తరేఖ', 'గొరిల్లా', 'ఆధునిక మహాభారతం', 'జనవంశం', “రుతుఘోషు', 'మండేసూర్యుడు', 'స్వర్ణహంస', 'రామాయణ రహస్యాలు' వంటి రచనలు చేశారు. 'కవిసేన మేనిఫెస్టో ఆయన సుప్రసిద్ధ రచన. ఆయన సాహిత్యకృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. కవిత్వం, సాహిత్య విమర్శ ఇతర వచన రచనలన్నీ కలిపి 40కి పైగా పుస్తకాలు వచ్చాయి.

ధన్జ్గరి సాహచర్యంతో రాణివాసానికి వెళ్ళి సాహిత్య సామ్రాట్గా మారినట్లు కనిపించినా, ఆయన చివరి దాకా ఎస్టాబ్లిష్మెంట్కు దూరంగానే ఉన్నారు. ఉద్యోగం తొలిరోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని ఐ.వి. సాంబశివరావుతో కలిసి నిర్మాణం చేసి కమ్యూనిస్టుగా ముద్రపడి ఆయనను నిర్బంధ పదవీ విరమణకు గురిచేసింది. 1955 ఆంధ్రా ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీవైపు నిలబడిన శ్రీశ్రీ దాదాపు మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఆయనకు అండగా కవిత రాసి ఓటమి తాత్కాలికమే అని ప్రోత్సహించిన కవి శేషేంద్ర. ఇంక 1991 నుంచి గల్ఫ్ యుద్ధాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని స్థిరంగా వ్యతిరేకించిన శేషేంద్ర 'నీతులు చెప్పే అమెరికా ఇదీ నీ చరిత అని వ్యాస సంపుటివెలువరించారు. ఆయన మరణానికి "వీక్షణం” తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.

వీక్షణం

రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక

జూలై 2007

---------

సహస్రాబ్ది దార్శనిక కవి

కవిర్విశ్వో మహాతేజా

గుంటూరు శేషేంద్ర శర్మ

Visionary Poet of the Millennium

                                      http://seshendrasharma.weebly.com/

జననం

1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

మరణం

2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

తండ్రి 

సుబ్రహ్మణ్య శర్మ

తల్లి

అమ్మాయమ్మ

భార్య /

జానకి 

పిల్లలు

వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)


కవి  విమర్శకుడు 
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ   కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు . 
                                                                                                          – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
                                                                                                                                     (21 ఆగస్టు, 2000)

“ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు. 

-