|
|
|
|
|
Creation date: Aug 17, 2026 2:08am Last modified date: Aug 17, 2026 2:08am Last visit date: Sep 20, 2026 7:01am
1 / 20 posts
Aug 17, 2026 ( 1 post ) 8/17/2026
2:08am
Saatyaki S/o Seshendra Sharma (seshendra)
ఒక సాహిత్య యుగానికి శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలో గుంటూరు శేషేంద్ర శర్మ ఒక విభిన్న ధ్రువతార. కవి, విమర్శకుడు, భాషా చింతకుడు, రాజకీయ స్పందన కలిగిన సాహిత్యవేత్తగా ఆయన స్థానం ప్రత్యేకమైనది. 2026 సంవత్సరం మే 31 నుంచి శేషేంద్ర శతజయంతి ప్రారంభమవుతుండగా, అదే సమయంలో ఆయన విప్లవాత్మక కావ్యం గొరిల్లాకు స్వర్ణోత్సవ కాలం కూడా రావడం ఒక చారిత్రక సందర్భం. తెలుగు సాహిత్యంలో తిరుగుబాటు స్వరాలు, అత్యవసర పరిస్థితి (Emergency) వ్యతిరేక భావజాలం, వ్యవస్థపై సాహిత్య నిరసన, ఈ మూడింటినీ ఒకే వ్యక్తిత్వంలో మిళితం చేసిన అరుదైన కవి శేషేంద్ర. కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది: కనుకనే ఎర్రరంగులో అండర్లైన్ చేయవలసిన పంక్తి. ఈ ఒక్క పంక్తి శేషేంద్ర సాహిత్య తత్వాన్ని మొత్తం చెప్పేస్తుంది. అందుకే శేషేంద్రను మహాకవి అని ఊరికే అనడం లేదు. ఆయన దృష్టిలో: కవి కలం ఒక ఆయుధం, రచన ఒక రాజకీయ ప్రకటన, కవిత్వం ఒక జెండా. ఇది కేవలం భావుకత కాదు; సాహిత్య ప్రతిఘటన.
‘గొరిల్లా’ అనే కావ్యం పుట్టిన ఈ స్వర్ణోత్సవ కాలం లోని ‘ఆధునిక మహాభారతం’ ఈ ఒకటో సర్గ తెలుగు ఆధునిక కవిత్వంలో అత్యంత తీవ్ర రాజకీయ, అస్తిత్వ ప్రతీకలతో కూడిన భాగాల్లో ఒకటి. ఇది సాధారణ కావ్యభాష కాదు; ఒక అణచివేత యుగంలో, కవి అంతరంగం తిరుగుబాటుగా మారిన క్షణాల కవిత్వం. ముఖ్యంగా భారత అత్యవసర పరిస్థితి 1975- 77 నేపథ్యాన్ని దృష్టి లో పెట్టుకొని చదివితే, ఇందులోని ప్రతీకలు మరింత గాఢార్థాన్ని సంతరించుకుంటాయి. మొదటి సర్గలో ‘కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’ అనే పొగరున్న పదాలు, ఇక కావ్యం అని వర్ణించే బలమైన శక్తి ఉంది. రాత్రి, భయ రాజకీయాల ప్రతీక కావ్యం మొదట్లోనే: రాత్రి నిద్ర కోల్పోయి కళ్లు కప్పులమీద మొరుగుతోంది అనే వాక్యం వస్తుంది. ఇది కేవలం ప్రకృతి వర్ణన కాదు. ఇక్కడ రాత్రి అంటే: ప్రజాస్వామ్య చీకటి, భయ వాతావరణం, మానవ స్వేచ్ఛల అణచివేత. ఎమర్జెన్సీ సమయంలో దేశం మొత్తం ఒక రాజకీయ చీకటిలోకి నెట్టబడిందనే భావాన్ని శేషేంద్ర ప్రతీకాత్మకంగా చూపిస్తున్నారు. 1927 అక్టోబర్ 20న జన్మించిన శేషేంద్ర శర్మ, తెలుగు కవిత్వాన్ని కేవలం భావుకతతో పరిమితం చేయకుండా, రాజకీయ చైతన్యంతో మేళవించారు. శేషేంద్ర రచనలు వ్యక్తి- వ్యవస్థ మధ్య ఉన్న సంఘర్షణను కవితా భాషలో ప్రతిఫలింపజేశాయి. శేషేంద్రను కేవలం ఆధునిక కవిగా మాత్రమే చూడటం తక్కువ అంచనా వేయడమే అవుతుంది. ఆయనలో మార్క్సిస్టు స్పందన, భారతీయ దార్శనికత, అంతర్జాతీయ రాజకీయ అవగాహన, వ్యక్తి స్వేచ్ఛపై గాఢమైన నమ్మకం కలిసిపోయాయి. 30 మే 2007న మరణించిన శేషేంద్ర శతజయంతి 2026లో జరుపుకోవడం అంటే కేవలం జ్ఞాపకార్థం కాదు; నేటి భారతదేశంలో స్వేచ్ఛ, విభిన్నాభిప్రాయం, సాహిత్య స్వాతంత్య్రం వంటి అంశాలపై మళ్లీ చర్చ మొదలుపెట్టే సమయం కూడా. ‘గొరిల్లా’ - విప్లవ స్వరానికి స్వర్ణోత్సవం 1976 ప్రాంతంలో వెలువడిన గొరిల్లా తెలుగు కవిత్వంలో అసాధారణ సంఘటన. ఇది కేవలం ఒక కావ్యం కాదు; అధికార నిర్మాణాలపై యుద్ధ ప్రకటన. గొరిల్లాలో శేషేంద్ర ఉపయోగించిన ప్రతీకలు, ఆగ్రహ భాష, వ్యవస్థను సవాలు చేసే స్వరాలు అప్పటి రాజకీయ పరిస్థితులకు ప్రతిస్పందన. Also Read - సంస్కరణలతో గాడినపడుతున్న విద్యారంగం గొరిల్లా లో కనిపించే గొరిల్లా ఒక జంతువు కాదు; అది అణచివేతకు వ్యతిరేకంగా తిరగబడే మనిషి ప్రతిరూపం. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తే, కవి చేతిలో పద్యం ఆయుధమవుతుందని శేషేంద్ర చూపించారు. అందుకే యాభై ఏళ్ల తరువాత కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. గొరిల్లా జంతువు కాదు, తిరుగుబాటు మనిషి కావ్యంలో గొరిల్లా ఒక ప్రధాన ప్రతీక. ఇది నిజమైన కోతి కాదు. ఇది: అణగారిన మనిషి, తిరుగుబాటు శక్తి, ఆకలి, కోపం, వ్యవస్థకు ప్రతిఘటన. శేషేంద్ర చెప్పిన మరో మాట: నా గుండెల్లో గొరిల్లాలు తలెత్తుతాయి అంటే కవి హృదయంలో తిరుగుబాటు ఉద్భవిస్తున్నది. ఇక్కడ గొరిల్లా ఒక ప్రజా ఆగ్రహం. అది ఆకలితో మండిపోతున్న విప్లవ శక్తి. నా గుండెమీద ఈ దేశం ఒక రైల్వే ప్లాట్ఫారం అయింది, తెల్లవారగానే నా జెండా ఎర్రనై పోయింది సముద్రం మొరగదు, పర్వతం వంగదు ఈ భాగంలో కవి తన అంతరాత్మను ప్రకృతి మహాశక్తులతో పోలుస్తారు: మరో చోట పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు అది అధికారానికి లొంగని రచయిత స్వభావం. ఎమర్జెన్సీ, తెలుగు సాహిత్యంలో భయానక నిశ్శబ్దం భారత అత్యవసర పరిస్థితి 1975 -77 భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలం. పత్రికలపై నియంత్రణ, రాజకీయ నాయకుల అరెస్టులు, విపక్షాల అణచివేత, దేశవ్యాప్తంగా భయ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో భారతదేశంలోని అనేక ప్రముఖ కవులు, రచయితలు మౌనం వహించారు. కొందరు అధికారాన్ని ప్రశంసించారు కూడా. అయితే శేషేంద్ర మాత్రం విరుద్ధ దారిని ఎంచుకున్నారు. 1976లో ఎమర్జెన్సీ వ్యతిరేక తెలుగు సంకలనాన్ని తీసుకురావడం గొప్ప సాహసమే. అది కేవలం సాహిత్య చర్య కాదు; రాజకీయ ధైర్యం. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ అధికార వ్యతిరేక కవిత్వం రాయడం ప్రమాదకరమని తెలిసినా వెనక్కి తగ్గలేదు. నిర్బంధ పదవీ విరమణ - కవిత్వానికి విధించిన శిక్ష శేషేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తూ, అధికార యంత్రాంగంపై విమర్శలు చేసినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు జరిగాయి. చివరకు Compulsory Retirement అనే రూపంలో ఆయనను సేవల నుండి తొలగించారు. ఇది శిక్షా లేక పనిష్‌మెంట్ అందామా? శిక్ష అయితే కోర్టులో నిలదీసే అవకాశం ఉంటుంది. కనుక బలవంతంగా రుద్దిన ‘పదవీ విరమణ’ అంటారు. ఇది కేవలం ఉద్యోగపరమైన చర్య కాదు; సాహిత్య స్వేచ్ఛపై రాజకీయ ప్రతీకారం అని అనేక మంది భావించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించే కవిత రాసినందుకు ఒక కవిని ఉద్యోగం కోల్పోయేలా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో పెద్ద ప్రశ్నగా నిలిచింది. శేషేంద్ర విషయంలో ముఖ్యమైనది, ఆయన అధికార వ్యతిరేకత వ్యక్తిగత ద్వేషం కాదు; వ్యవస్థలోని నిరంకుశత్వంపై వ్యతిరేకత. అందుకే ఆయన రచనలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. భయం భయం అని మొరుగుతున్నారు విచిత్రమేమంటే సుప్రసిద్ధమైన తెలుగు కవులు ఆనాటి ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని భజనచేస్తూ బోలెడు కవితలు, గేయాలు రాశారు. అర్థం కాకపోవచ్చు. లేదా ప్రధానంగా భయం కావచ్చు. 1975లో రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించిన 36 పేజీల దీక్ష కవితా సంకలనం వచ్చింది. ఈ కవితా సంకలనాన్ని అన్యాయాలు, అక్రమాలపై తెలుగుకవుల తిరుగుబాటుగా ప్రకటించారు. అదో రకం భజన, భయం. అక్రమాలు, అన్యాయాలేమిటో చెప్పలేదు. అవి ఎవరు చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో? తెలుపనే లేదని ప్రముఖ రచయిత, కవి, జర్నలిస్టు రజాహుస్సేన్ వివరించారు. ‘1975లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేంద్ర ముద్రణాలయంలో మొత్తం 10,000 కాపీలను ముద్రించి ప్రజలకు పంచిపెట్టారు. అందులో కవితలు రాసినవారిలో దాశరథి, డాక్టర్ సి. నారాయణరెడ్డి, డాక్టర్ బోయి భీమన్న, డాక్టర్ దివాకర్ల వెంకటావధాని, ముదిగొండ వీరభద్రమూర్తి, ఉత్పల, జె. బాపురెడ్డి, పరిమళా సోమేశ్వర్, డాక్టర్ వేటూరి ఆనందమూర్తి, ఎస్. మునిసుందరం, పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి, గుత్తికొండ సుబ్బారావు, జ్యోతిర్మయి, విహారి, శాలివాహన, లసూనా, తల్లాప్రగడ భద్రిరాజు, దేవీప్రియ తదితరులు ఉన్నారు’. కవులు ఎమర్జన్సీలో అన్యాయాలేమిటో సమాజానికి తెలియజేసే బాధ్యత వదిలేసిన వారు, అంతేకాదు, ఇప్పుడు కూడా దారుణాలు జరుగుతూ ఉంటే భజనలు చేసే కవులు, భావకవులు, ముభావ కవులు, దేశానికి ఏ ఉపయోగం? ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన శేషేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ‘శేషేంద్ర ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పశు పర్వం కావ్యాన్ని రచించారు. ఈ కావ్యంలో ఎక్కడా నేరుగా ఎమర్జెన్సీ అనే పదం వినిపించదు. కానీ ధ్వనిపూర్వకంగా నాటి అణచివేత, భయానక పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. అందుకే ఇది తెలుగు సాహిత్యంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వచ్చిన తొలి ధిక్కార కావ్యాలలో ఒకటిగా నిలిచింది. ఈ కావ్యంలో నాలుగు సర్గలు ఉన్నాయి. ప్రతి సర్గ కూడా నాటి ఎమర్జెన్సీ క్రౌర్యాన్ని ప్రతిబింబిస్తుంది’ అని రజాహుస్సేన్ వ్యాసంలో చాలా ధైర్యంగా ప్రశ్నించారు. ‘నా దేశం నా ప్రజలు’ శేషేంద్ర అత్యంత ప్రసిద్ధ రచనల్లో ఒకటి. ఈ కావ్యంలో దేశం అంటే కేవలం భూభాగం కాదని, ప్రజల బాధలే దేశం అని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రశ్నలన్నీ వివాదానికి కారణమయ్యాయి: శేషేంద్ర పాలకులను ప్రజలనుండి వేరుపడిన వర్గంగా చిత్రించారు. ప్రజాస్వామ్యం పేరుతో అధికార కేంద్రీకరణ జరుగుతోందని ఆయన భావన. దేశంలో ఆకలి, నిరుద్యోగం, అసమానతలను ఆయన జాతీయ అవమానంగా చూపించారు. ఇది అభివృద్ధి ప్రచారాన్ని ప్రశ్నించింది. ఆయన దృష్టిలో చరిత్రను నాయకులు కాదు, ప్రజలే నిర్మిస్తారు. ఈ భావనలో విప్లవాత్మక ప్రజాస్వామ్య తత్వం ఉంది. దేశభక్తి అంటే ప్రభుత్వాన్ని ప్రశంసించడం కాదు; ప్రజల బాధను వ్యక్తపరచడం అనే అంతర్లీన భావం ఈ కావ్యంలో బలంగా కనిపిస్తుంది. శేషేంద్ర కవిత్వంలో వ్యక్తి ఒక విధేయ పౌరుడు కాదు; ప్రశ్నించే పౌరుడు. అదే అధికార వర్గాలకు అసహనంగా కనిపించింది. ‘సినిమా పాట: నంది అవార్డు వివాదం శేషేంద్ర కేవలం కావ్యరచయిత మాత్రమే కాదు; సినీ గేయరచయిత కూడా. ఆయన రాసిన ఎక్కువ పాటలు రాయకపోయినా, ముత్యాల ముగ్గు చిత్రంలోని నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. తెలుగు సినీ సాహిత్యంలో అత్యంత కవితాత్మకమైన గీతాల్లో ఒకటిగా నిలిచింది. ఆ పాటకు నంది అవార్డు ప్రతిపాదన వచ్చినప్పటికీ, రాజకీయ- వ్యవస్థాపక కారణాలవల్ల అవార్డు ఇవ్వలేదని అప్పట్లో చర్చ జరిగింది. ఆయనపై వివాదాస్పద రచయిత, వ్యవస్థ వ్యతిరేకి అనే ముద్ర ఉండటం కూడా అధికార వర్గాల నిర్ణయాలపై ప్రభావం చూపిందని సాహిత్య వర్గాలు భావించాయి. ఇది భారతదేశంలో కళాకారుడి రాజకీయ అభిప్రాయాలు అతని కళాత్మక గుర్తింపుపై ఎలా ప్రభావం చూపుతాయో తెలిపే ఉదాహరణగా నిలిచింది. ఆనాటి శేషేంద్ర ‘నాదేశం’ ఈనాటి సందేశం శేషేంద్ర శర్మ జీవితాన్ని పరిశీలిస్తే మూడు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి: కవిత్వం అధికారానికి సేవ చేయకూడదు. రచయితకు స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది. ‘ప్రజల బాధను పలకని సాహిత్యం చరిత్రలో నిలవదు. నేటి కాలంలో కూడా రచయితలపై ఒత్తిళ్లు, భావ వ్యక్తీకరణపై చర్చలు జరుగుతున్న సమయంలో శేషేంద్ర మరింత సమకాలీనుడిగా కనిపిస్తారు. ఆయనను చదవడం అంటే కేవలం కవిత్వాన్ని ఆస్వాదించడం కాదు; ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవడం కూడా. ప్రజాస్వామ్య బాధ్యతలపై మళ్లీ ఆలోచించే చారిత్రక సందర్భాలలో ఇదొకటి. మాడభూషి శ్రీధర్ 5 June 2026శేషేంద్ర శర్మ (20-10-1927 - 30-5-2007) సంస్మరణ ప్రముఖ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ (79) మే 30 రాత్రి మరణించారు. ఆయన 1927లో నెల్లూరులో తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ పనిచేశారు. 'నా దేశం నా (ప్రజలు' ‘శేషజ్యోత్స్న’, ‘రక్తరేఖ', 'గొరిల్లా', 'ఆధునిక మహాభారతం', 'జనవంశం', “రుతుఘోషు', 'మండేసూర్యుడు', 'స్వర్ణహంస', 'రామాయణ రహస్యాలు' వంటి రచనలు చేశారు. 'కవిసేన మేనిఫెస్టో ఆయన సుప్రసిద్ధ రచన. ఆయన సాహిత్యకృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. కవిత్వం, సాహిత్య విమర్శ ఇతర వచన రచనలన్నీ కలిపి 40కి పైగా పుస్తకాలు వచ్చాయి. ధన్జ్గరి సాహచర్యంతో రాణివాసానికి వెళ్ళి సాహిత్య సామ్రాట్గా మారినట్లు కనిపించినా, ఆయన చివరి దాకా ఎస్టాబ్లిష్మెంట్కు దూరంగానే ఉన్నారు. ఉద్యోగం తొలిరోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని ఐ.వి. సాంబశివరావుతో కలిసి నిర్మాణం చేసి కమ్యూనిస్టుగా ముద్రపడి ఆయనను నిర్బంధ పదవీ విరమణకు గురిచేసింది. 1955 ఆంధ్రా ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీవైపు నిలబడిన శ్రీశ్రీ దాదాపు మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఆయనకు అండగా కవిత రాసి ఓటమి తాత్కాలికమే అని ప్రోత్సహించిన కవి శేషేంద్ర. ఇంక 1991 నుంచి గల్ఫ్ యుద్ధాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని స్థిరంగా వ్యతిరేకించిన శేషేంద్ర 'నీతులు చెప్పే అమెరికా ఇదీ నీ చరిత అని వ్యాస సంపుటివెలువరించారు. ఆయన మరణానికి "వీక్షణం” తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. వీక్షణం రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక జూలై 2007 --------- సహస్రాబ్ది దార్శనిక కవి కవిర్విశ్వో మహాతేజా
“ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం) ఆంధ్ర భువిని అత్యున్నతంబైనయట్టి ------------- కత్తులుగా మొలిచిన శేషేంద్ర మాటలు మానవత్వం పరిమళించే తోటలై, యువశక్తిని నవయుగం వైపుకు నడిపించే బాటలై, సారస్వత విలువలను సంరక్షించే దుర్భేద్యమైన కోటలై ఈ శతాబ్ది చైతన్య స్రవంతిలో అంతర్లీనమయ్యాయి. ఇదీ శేషేంద్ర సంకల్పం. ఇదీ శేషేంద్ర స్వామ్యవాద సాహిత్య శిల్పం……… * * * అక్టోబర్ తర్వాత విప్లవంతో పెనవేసుకున్న మరో నెల మే . అదే మే డే ! కాకతాళీయంగా శేషేంద్ర నిర్యాణం మే నెలలోనే. అలా జనన మరణాలను అనూహ్యంగా విప్లవంతో అనుసంధానం చేసుకున్న కాలజ్ఞులు శేషేంద్ర.. - -- డా.వెనిగళ్ళ రాంబాబు - సినీ గీత రచయిత - ------------- అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర “గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.” ఆచార్య పేర్వారం జగన్నాథం సంపాదకుడు అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు, (ప్రచురణ 1987) మాజీ వైస్ ఛాన్సలర్, తెలుగు యూనివర్సిటీ) Visionary Poet of the Millennium -------- | |||||||||||||||||