|
|
|
|
|
Creation date: Aug 17, 2026 7:10pm Last modified date: Aug 17, 2026 7:12pm Last visit date: Sep 20, 2026 7:01am
1 / 20 posts
Aug 17, 2026 ( 1 post ) 8/17/2026
7:10pm
Saatyaki S/o Seshendra Sharma (seshendra)
యుగానికొక్కడు ! గగనానికి సాటి గగనమే! సాగరానికి సాటి సాగరమే! ---------- గగనానికి సాటి గగనమే! సాగరానికి సాటి సాగ రమే! అన్నట్లు శేషేంద్రకు సాటి శేషేంద్రే! మరి యొకరు సరికారు. అతడొక యుగకవి! యుగద్రష్ట! అం దువల్ల అతని గురించి కానీ అతని సాహిత్యం గురించి కానీ, ముఖ్యంగా వారి ’కవిసేనఫెస్టో’ గురించికానీ మాట్లా డం ఒక సాహసమే అవుతుంది. ఇక శేషేంద్రను లోకానికి పరిచయం చేయడమన్నా అంతే! ఒక చిట్టి దీపం వెలుగు ల్లో సూర్యుని చూపినట్లూ, ఒక గజం బద్దతో సముద్రాన్ని కొలువ జూచినట్లా అవుతుందది.
(30 శేషేంద్ర శర్మ 17వ వర్ధంతి ) ------------------ ----------- శేషేంద్ర శర్మ (20-10-1927 - 30-5-2007) సంస్మరణ ప్రముఖ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ (79) మే 30 రాత్రి మరణించారు. ఆయన 1927లో నెల్లూరులో తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ పనిచేశారు. 'నా దేశం నా (ప్రజలు' ‘శేషజ్యోత్స్న’, ‘రక్తరేఖ', 'గొరిల్లా', 'ఆధునిక మహాభారతం', 'జనవంశం', “రుతుఘోషు', 'మండేసూర్యుడు', 'స్వర్ణహంస', 'రామాయణ రహస్యాలు' వంటి రచనలు చేశారు. 'కవిసేన మేనిఫెస్టో ఆయన సుప్రసిద్ధ రచన. ఆయన సాహిత్యకృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. కవిత్వం, సాహిత్య విమర్శ ఇతర వచన రచనలన్నీ కలిపి 40కి పైగా పుస్తకాలు వచ్చాయి. ధన్జ్గరి సాహచర్యంతో రాణివాసానికి వెళ్ళి సాహిత్య సామ్రాట్గా మారినట్లు కనిపించినా, ఆయన చివరి దాకా ఎస్టాబ్లిష్మెంట్కు దూరంగానే ఉన్నారు. ఉద్యోగం తొలిరోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని ఐ.వి. సాంబశివరావుతో కలిసి నిర్మాణం చేసి కమ్యూనిస్టుగా ముద్రపడి ఆయనను నిర్బంధ పదవీ విరమణకు గురిచేసింది. 1955 ఆంధ్రా ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీవైపు నిలబడిన శ్రీశ్రీ దాదాపు మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఆయనకు అండగా కవిత రాసి ఓటమి తాత్కాలికమే అని ప్రోత్సహించిన కవి శేషేంద్ర. ఇంక 1991 నుంచి గల్ఫ్ యుద్ధాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని స్థిరంగా వ్యతిరేకించిన శేషేంద్ర 'నీతులు చెప్పే అమెరికా ఇదీ నీ చరిత అని వ్యాస సంపుటివెలువరించారు. ఆయన మరణానికి "వీక్షణం” తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. వీక్షణం రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక జూలై 2007 --------- సహస్రాబ్ది దార్శనిక కవి కవిర్విశ్వో మహాతేజా
“ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం) ఆంధ్ర భువిని అత్యున్నతంబైనయట్టి ------------- కత్తులుగా మొలిచిన శేషేంద్ర మాటలు మానవత్వం పరిమళించే తోటలై, యువశక్తిని నవయుగం వైపుకు నడిపించే బాటలై, సారస్వత విలువలను సంరక్షించే దుర్భేద్యమైన కోటలై ఈ శతాబ్ది చైతన్య స్రవంతిలో అంతర్లీనమయ్యాయి. ఇదీ శేషేంద్ర సంకల్పం. ఇదీ శేషేంద్ర స్వామ్యవాద సాహిత్య శిల్పం……… * * * అక్టోబర్ తర్వాత విప్లవంతో పెనవేసుకున్న మరో నెల మే . అదే మే డే ! కాకతాళీయంగా శేషేంద్ర నిర్యాణం మే నెలలోనే. అలా జనన మరణాలను అనూహ్యంగా విప్లవంతో అనుసంధానం చేసుకున్న కాలజ్ఞులు శేషేంద్ర.. - -- డా.వెనిగళ్ళ రాంబాబు - సినీ గీత రచయిత - ------------- అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర “గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.” ఆచార్య పేర్వారం జగన్నాథం సంపాదకుడు అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు, (ప్రచురణ 1987) మాజీ వైస్ ఛాన్సలర్, తెలుగు యూనివర్సిటీ) Visionary Poet of the Millennium | |||||||||||||||||