|
|
|
|
|
Creation date: Aug 17, 2026 11:40pm Last modified date: Aug 17, 2026 11:41pm Last visit date: Sep 20, 2026 7:01am
1 / 20 posts
Aug 17, 2026 ( 1 post ) 8/17/2026
11:40pm
Saatyaki S/o Seshendra Sharma (seshendra)
వచన కవిత్వంకాదు. ప్రవచన కవిత్వం
నా దేశ నా ప్రజలు గుంటూరు శేషేంద్రశర్మ - ఆర్ .ఎస్ సుదర్శనం - ఆర్.యస్.సుదర్శనం తెలుగు భాషలో పేరెన్నికగన్న విమర్శకులలో ఒకడు.[1] ఈయన పాశ్చాత్య విమర్శ దృక్పథంతో విమర్శలు సాగించారు.[2] - జీవిత విశేషాలు - ఆయన మదనపల్లెలో డిసెంబరు 13 1927 న జన్మించారు. ఆయన మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మదనపల్లె దివ్యజ్ఞాన కళాశాల లలో విద్యాభ్యాసం చేసారు.మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి 1947లో పట్టా పుచ్చుకున్నాడు. ప్రముఖ రచయిత్రి ఆర్.వసుంధరాదేవి ఇతని భార్య. వివిధ కళాశాలలలో అధ్యాపకునిగా, విభాగాధిపతిగా, ప్రిన్సిపాల్ గానూ పనిచేసి పదవీవిరమణ చేసిన తరువాత ఆయన 1986లో స్వంత ఊరైన మదనపల్లెలో శేష జీవితం గడిపి డిసెంబరు 14 2001 న కన్నుమూసారు.
------------ నడుస్తున్న చరిత్రని ఆధునిక మానవేతిహాసంగా రూపొందిస్తూ వచన కవితా మార్గంలో శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ చేసిన సరిక్రొత్త ప్రయోగం 'నాదేశం - నా ప్రజలు.. ఎన్నోవిధాల విలక్షణమైన కావ్యం . 'నా దేశం - నా ప్రజలు' వచన కవిత్వంకాదు. ప్రవచన కవిత్వం. ఎత్తుగడలో, శిల్పంలో, దృక్పథంలో, ఇతివృత్తంలో, నిర్మాణ సౌష్టవంలో విలక్షణమైన నూత్నసృష్టి. ఈ కావ్యంతో తెలుగు కవిత్వం ఒక మలుపు తిరిగిందని చెప్పడం తొందరపాటు కాదనుకుంటాను. 'కృష్ణపక్షం’ భావకవితకూ, “మహాప్రస్థానం' అభ్యుదయ కవితకూ వేగుజుక్కలైనట్లే 'నా దేశం - నా ప్రజలు' తెలుగు కవిత్వాన్ని కొత్తదారుల్లో నడిపిస్తుందని నాకు తో స్తుంది. ---------------- నడుస్తున్న చరిత్రని ఆధునిక మానవేతిహాసంగా రూపొందిస్తూ వచన కవితా మార్గంలో గుంటూరు శేషేంద్రశర్మ చేసిన సరిక్రొత్త ప్రయోగం 'నాదేశం - నా ప్రజలు.. ఎన్నోవిధాల విలక్షణమైన కావ్యం . ఈ యుగంలో నాయకుడు శ్రమజీవి - కార్మికుడు, కర్షకుడు ఆయిన మానవుడు, మనిషిలోని సృజనాత్మకశక్తి, కార్మికునిలో అయినా, కర్ష కునిలో అయినా, కవిలో అయినా, వేదాంతిలో అయినా, శాస్త్ర పరిశోధ కునిలో అయినా, రాజ్యపరిపాలకునిలో అయినా, మౌలికంగా ఒక టే : దీన్ని “మనం సాధారణంగా అంగీకరించం. సామ్యవాది అయినవాడూ లేక సమదర్శి అయినవాడూ తప్పక అంగీకరిస్తాడు. మానవుణ్ని గూర్చిన అద్వైత సమన్వయదృష్టి “నాదేశం నా ప్రజలు" కావ్యానికి ఆధారం. ఆధునిక కావ్యాల్లో 'మానవత'కు యిచ్చే నిర్వచనంకాని, వివరణ కాని ఏవో ఒక రాజకీయ లేక సాంఘిక లేదా మనో పై జ్ఞానిక దర్శనం మీద ఆధారపడి వుంటోంది. శర్మగారు ఈ కావ్యంలో 'మానవత'కు ఔపనిషధిక మైన, అద్వైత వేదాంతపరమైన నిర్వచనం యిచ్చారు. దానికీ, ఏవిధ మైన 'విప్లవ భావాలకూ వైరుధ్యం వైషమ్యం లేదనే సత్యాన్ని కూడా ఈ కావ్యంద్వారా వ్య క్తంచేశారు. వేదాంతాన్ని సాంప్రదాయికమైన పైయ క్తి కపు ఏకాంతశిఖరాలనుంచీ వర్తమాన సామాజిక మానవజీవన భూము లకు, భగీరథునిలాగ తరలింపజేశారు. అందువల్ల 'గంగ'కు వచ్చిన లోటేమీ లేదు. * "నేను ధాన్యంలో నుంచీ పుట్టాను, ధాన్యంకోసమే ఒడుపుతాను, మరణించి ధాన్యంలోకే వెళ్ళిపోతాను" (ఒకదో సర్గ) కర్షణపైన పేషి వాక్యంలా తోపింపజేస్తూనే, సృష్టిగా రూపొందుతున్న తత్వాన్ని గూర్చి చెప్పే ఉపనిషద్వాలని ధ్వనిస్తూ, రెండింటికి అభేదాన్ని ప్రతిపాదించే దృష్టితో, చమత్కారమైన శిల్పంతో ఈ కావ్యం ప్రారంభం అవుతుంది. శర్మగారు మొదట వ్రాసిన 'మండే సూర్యుడు' పద్యాలలోనే సూర్యుడు, మానవుని సృజనాత్మకశక్తికి ప్రతీక అయినాడు. ఆ ప్రతీక ఈ కావ్యం లోనూ, అలాగే స్వీకరింపబడింది. విలయమ్ బ్లేక్ వ్రాసిన 'ప్రవచన కవిత్వం' (P ophetic Poems) లో మానవుని సృజనాత్మకశక్తిని చవి మనీష' (Poetic genius) అని వ్యవహరించాడు. అంటే కేవలం కవిత్వ రచనాశక్తి కాదు. సృష్టిలో సర్వత్ర గోచరమయ్యే నృజనాత్మకశక్తి యొక్క అంశగా కవితాశక్తిని సృష్టిశక్తికి ప్రతీక చేశాడు బ్లేక్, శర్మ గారూ అలాగే చేశారు. సూర్యుడు, సూర్యకిరణాలు ఆ సృష్టిశక్తికి ప్రతీక. ఉపనిషత్తులో గాయత్రికిగల ప్రాముఖ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటే దీని స్వారస్యం విదితమవుతుంది. కావ్యంలో 'నేను', 'సూర్యుడు ఒక్కటే అయినా రెండుగా కనిపించి, ఒక్కటై, మళ్ళీ వేరవుతూ వుంటారు. ఒకటో సర్గ - - “లేస్తోంది ఉషఃకాంతుల్లోనించి ఒక హస్తం !.... నేను కళ్ళు తెరిచి, ఆవులిస్తూ లేస్తా" అని ప్రారంభం. తర్వాత “ఈ చేతో నేను ఏ అందాన్ని సృష్టించలేదు: ఏది ఈ భూమిమీద చేతికి లొంగలేదు : కాని ఈ చెయ్యి ఖాళీగానే వుండిపోయింది శాశ్వతంగా" అనడంలో 'నేను' ‘సూర్యుడు' తాదాత్మ్యంచెంది సృష్టికర్తకూడా ధ్వనిస్తు న్నాడు. ఇక్కడ సృష్టికర్తయై, సృష్టిలో అంతర్లీనమైకూడా సృష్టికి అతీతంగా వుండే తత్వాన్ని ప్రతిపాదించడమే కాకుండా, కార్మిక కర్షకుల శ్రమఫలితం వారికి దక్కకుండా పోతున్న నేటి సమాజవ్యవస్థ తీరుకూడా ప్రసక్తమైంది. కావ్యమంతా యిదే పద్ధతి .కావ్యంలో శ్రామికుడు; మానవుడు, సూర్యుడు సృష్టిక ర్త ఒకరిలో ఒక రై, ఒక్కొక్కరూ వేరై, విభిన్న కంఠస్వరాలు పలుకుతూ వుంటాయి. * నడుస్తున్న చరిత్రను, మానవేతిహాసాన్ని కథనం చేసేం దుకు కవి అవలంబించిన విలక్షణమైన శిల్పం యిది. కవి తాత్వికదృష్టి, భావన, శిల్పము ఇతివృత్తము ఒకదానితో ఒకటి కలిసి, వేరై, ఒకటి మరొకటిగా, చిత్రవిచిత్రమైన స్ఫురణలతో ప్రతి వాక్యానికి విశిష్ట కవితా గుణాన్ని బహుళ వ్యంజకత్వాన్ని సమకూర్చుతున్నాయి. వీటిని వి విశ్లేషించు కోవడం, వాక్యాల్ని మామూలు ఆలోచనా పద్ధతిలోకి తర్జుమా చేసుకోవడం పాఠకుని కృషి. ఒకవేళ అలా చేసుకోకపోయినా యిబ్బందిలేదు. కావ్యం యొక్క ఆస్వాదనలో లభించే అనుభూతి మేధాసృష్టం కాకుండానే నేరుగా హృదయంగమం అయ్యే లక్షణం ఈ కావ్యంలో పుష్కలంగా ఉన్నది. హృదయంగమం అయినదాన్ని అవసరమనుకుంటే వివేచించి విడమర్చుకోవచ్చు. అటువంటి వివేచనకు నిలిచే నిర్మాణ సౌష్టవం, తాత్విక, బలం కూడా ఈ కావ్యానికి ఉన్నది. ఉదాహరణకు ఒకదో సర్గను విశ్లేషించి చూద్దాం ఇందులోని ఇతి వృత్త విన్యాసం యిలా వుంది- (1) సృజనాత్మక శక్తి, దాని పరివ్యాప్త మైన స్వరూప వివరణ - మానవుడు, కర్త కుడు, కార్మికుడు, నేతపనివాడు, రస్తాకూలీ, సైనికుడు, కవి, వ్యక్తి, నావికుడు, శిల్పి వగైరా - కాని సృష్టికర్త (శ్రామికుని చెయ్యి ఖాళీగానే ఉండిపోతున్నది. ఇక్కడ వేదాంతపరమైన సత్యమూ, నేటి వ్యవస్థాలక్షణ నిర్దేశమూ కవి శిల్ప చమ త్కారంవల్ల ఏకీభవిస్తున్నవి. (2) ‘గడచిన చరిత్రలో నాకు తావులేదు. ఇప్పుడు నడిచే చరిత్రకు నీతిలేదు అనే గొంతుక శ్రామిసనిది. అంతలోనే 'నా బ్రతుకొక సున్న, కానీ నడుస్తున్నా' అనే గొంతుక ఆక్మ ఫెర్మి ప్రత్యాఖ్యానంతో దారికోసం వెదికే నాగరకునిది. (Self-alienated modern man) ముగింపులో 'నేను మాత్రం నడుస్తున్నా.... రగిలే ఎర్ర కోరికే ఒక జెండగా ' అనే గొంతులో పై యిద్దరూ సృష్టికర్తతో (సృష్టికి నాంది సంకల్పం) సమసించడం జరుగుతుంది. ( ) 'క్షణాలు కేవలం కాలాన్ని అనుసరించే పరివారంకాదు, కొన్ని క్షణాలుంటాయి. యావ త్తు మానవచరిత్రనూ మార్చగల మహత్తు ఉన్నవి' అనే కవి ప్రవ చనంలో భవిష్యద్వాణీ, క్షణానికి అనంతానికీ జరిగే సంయోగమూ ధ్వని స్తుంది. విప్లవానికి నాందీవాక్యమూ అదే అవుతుంది. నడుస్తున్న చరి త్రలో మార్పు ఎలా వస్తుంది ? 'సూర్యుడు తేజస్వి అవుతున్నాడు. సు త్తులు కొడవళ్ళులాంటి కిరణాలు మిలియన్లు ప్రదానం చేస్తున్నాడు' విప్లవం సృజనాత్మకశక్తి యొక్క కాలానుగుణమైన స్వరూపం. 'విప్లవం ఎందుకు ?' అంటే విప్లవం తప్పదు అనే సమాధానం. (ఝుందూమారు తాన్ని అడుగు నీ కెందుకింత ఆవేశం అన్ని విప్లవం ఎలా వస్తుంది : కవీ (కాలాన్ని కాగితచేసుకుంటా), శ్రామికుడూ (శిల్పంగా చెక్కి భూమి మీద నిలబెడతా), మేధావీ (కోరిక గొంతెత్తి అరుస్తుంది, కొత్త శకాన్ని లోకంమీదికి విసిరేస్తుంది) నడుం కట్టుతారు, ఒకటోతారు, చివరకు సృష్టి చీలా విలాసంతో (చతుర్భుజ పద్యాలతో) సృష్టికర్తే కవిగా కొ కొత్త కావ్యాన్ని 'రచిస్తాడు. (4) ప్రకృతికి వసంతం వస్తుంది. సమాజం మారు తుంది. వ్యక్తి జీవితంలో అందం, ఆనందం ప్రవేశిస్తాయి. ఇది కల, ఇది ఆశ, ఇదే మానవుడు సృష్టించుకునే భవిష్యత్తు. ఇదే కావ్యం. కవిలో నిర్వేదం పోయి సంతోషం వెల్లి విరుస్తుంది. ('కన్నీరు కార్చిన చెట్టు నా కలమీద పూలవాన కురిసింది' అంటాడు) ఈ విశ్లేషణ ద్వారా కావ్యనిర్మాణాన్నీ, కావ్యతత్వాన్నీ స్థాలీపులా కంగా గ్రహించవచ్చు. నిజానికి ఒకటో సర్గలోని పథకమే రకరకాలుగా పునరావృత్తమై, విస్తృతమౌతుంది మిగతా సరల్లో. ఇది కావ్యంలో లయ, వర్తులాలుగా సర్గలు సాగిపోతాయి. నీటిలో చిన్నరాయి విసరి నప్పుడు వి స్తృతమయ్యే తరంగవలయాలులాగ యితివృత్తం సర్గనుంచీ సరకి వి స్తరిస్తుంది. రెండో సరలో ఆదిమానవుని దగ్గరనుంచీ జరిగిన చరిత్ర తాలూకు స్మృతి ధ్వనిస్తుంది. మూడో సర్గలో వర్తమానం, నగర జీవితం, దానినుంచీ పారిపోయే మానవుడు, వీడికి జరామరణాలే పరిష్కార మార్గాలా ? అన్న ప్రశ్న చరిత్ర తత్వాన్ని గూర్చిన జిజ్ఞాస ఉన్నాయి. నాలుగో సర్గలో విప్లవభావాలకు అంకురార్పణ జరుగుతుంది. కవి మనిషి ఆవేదనని, హృదయానుభూతిగా అవగాహన చేసుకుంటాడు. భూమి సూర్యుణ్ని పునరుజ్జీవనంకోసం అర్థిస్తుంది. అయిదో సర్గలో విప్లవానికి దారితీసే దుర్భర పరిస్థితుల చిత్రణా, విప్లవానికి సన్నాహం ఉన్నాయి. ఆరో సర్గలో కవి ప్రజల్ని ఉద్బోధిస్తాడు, పరిస్థితుల్ని విమర్శిస్తాడు. మానవత్వంతో చెర్లాడేవాళ్ళని దూషిస్తాడు, “నా మెదడులో భావాల అర ణ్యాలకు నిప్పంటుకుంది" అంటూ వర్తమాన వ్యవస్థకే నిప్పంటిస్తాడు. ఈ ఆరో సర్గ టి. ఎస్. ఎలియట్ 'వెస్టాండ్ ' తో సరితూగే కవిత్వం. ఏడో సర్గలో ప్రకృతి జయిస్తుందన్న విశ్వాసం కవికి కలుగుతుంది. మిదో సర్గలో ప్రకృతివిజయం, ప్రేమవిజయంగా, మానవతావిజయంగా కవి దర్శించడంతో కావ్యం ముగుస్తుంది. ఈ కావ్యం ఏ కోవకు చెందుతుంది ? ఆధ్యాత్మికవాదులకూ మార్మిక, భావకవులకూ, చరిత్రతో, విప్లవంతో, శ్రామికునితో అవసరం లేదు వీటితో అవసరం ఉన్న అభ్యుదయ కవులకూ, విప్లవకవులకూ వేదాంతంతో బొత్తిగా పడదు : ఈ రెండు రకాలవారిది సంకుచితదృష్టి తప్ప సమగ్రదృష్టి కాదని ఈ కావ్యం ప్రతిపాదిస్తున్నది. భారతీయ దర్శన మైన వేదాంతానికి కేవలం భారతీయ చారిత్రక, సాంప్రదాయిక పరిధుల్ని నిర్దేశించి దాన్ని అలా బంధించడానికి వీల్లేదంటున్నది ఈ కావ్యం. వేదాం తానికి ఉన్న సమగ్ర మానవతాదృష్టినీ, దాని విప్లవాత్మకశక్తిని గూర్చి ప్రతిభతో చాటిచెప్పిన ఆధునికుడు వివేకానందస్వామి. అయినప్పటికీ వేదాంత దృక్పథాన్ని గూర్చిన అపోహా, తక్కువచూపూ, పాశ్చాత్యులు మనకు ఏళ్ళ తరబడి సంక్రమింపజేసి వెళ్ళిన వారసత్వం. దాన్ని వదులుకో లేకపోతున్నాం. పాశ్చాత్య దర్శనాలతో పబ్బం గడుపుకోవాలని చూచే మనవాళ్ళ మన స్తత్వంలో కేవలం అనుకరణ ప్రవృత్తి, సృజనాత్మకశక్తి లోపించడమే కనిపిస్తుంది. అంటే నేడు రాజకీయ, సాంఘిక విప్లవాన్ని ప్రతిపాదించే సిద్ధాంతాలలో పథకాలలో శాస్త్రదృష్టి, ప్రయోజనాత్మకత శూన్యమని చెప్పడంలేదు : ఈ యుగంలో ఏ సిద్ధాంతమైనా శాస్త్రమైనా మౌలికంగా మానవతాదృష్టిమీదే ఆధారపడి ఉంటోంది. అటువంటి దృష్టి తోటే మార్క్స్ దర్శనం రూపొందింది. ప్రపంచవ్యాప్తమైంది. కాని ఆ మానవతాదృష్టి, సామాజికదృష్టి వేదాంతానికి లేదనుకోవడం పెద్ద పొరపాటు. వివేకానందస్వామి ఒకచోట ఆధునికయుగాన్ని గూర్చి రాబోయే యుగం కార్మిక కర్షకయుగంగా, నాలుగవ వర్ణమైన శూద్రులయుగంగా వివరించి చెప్పారు. సామాజిక పరిణామంలో బ్రాహ్మణులనుంచీ, క్షత్రియులనుంచీ, వైశ్యుల * నుంచీ విప్లవం ఏ విధంగా చరిత్రలో సామాజిక ఆధిపత్యాన్ని ఒకవర్గంనుంచీ మరోవర్గానికి చెందేలా చేస్తూ వచ్చిందో వివరిస్తూ ఇరవయ్యో శతాబ్దంలో శ్రామిక విప్లవాన్నీ, శ్రామికవర్గం ఆధిపత్యాన్నీ సూచించారు. మార్క్సిజమ్ రాకపూర్వమే వివేకానందుడూ హించిన విప్లవం యిది. పోతే కవిత్వానికి కావలసింది శా శాస్త్రదృష్టికాదు. కీయ పథకాలు కావు. వాటికి మూలమైన ఆధునిక యుగధర్మాన్ని ఆకళించు కొన్న మానవతాదర్శనం వేదాంత దృక్పథంతో ఆధునిక మానవుని వైయ క్తిక, సామాజిక పైక్ల బ్యాన్ని ఆవిష్కరిస్తూ, శాస్త్రీయ రాజకీయ సమన్వ యంతో విప్లవాన్ని ఆవాహన చేస్తూ ఈ కావ్యాన్ని నిర్మించిన శేషేంద్ర శర్మను ఆధునికుల్లో ఆధునికుడుగా అచ్చమైన భారతీయుడుగా అభినందించాలి. ఇరవయో శతాబ్దపు మానవుణ్ని ప్రకృతినుంచీ, భగవంతుడినుంచీ ప్రత్యాఖ్యానం (Alienated) చెందిన మానవుడిగా ఆధునిక సాహిత్యం చిత్రిస్తోంది, వేదాంతదృష్టిలో 'ప్రత్యాఖ్యానం' ఒక ఆఖాన (Appearance) మాత్రమే ! పాశ్చాత్యుల భావన వేరు. వాళ్ళకు క్రైస్తవమతం తాలూకు పురిటివాసనలున్నాయి. భగవంతుడి ఆజ నతిక్రమించి ఆజ్ఞ ఈడెన్ నుంచీ బహిష్కృతుడై న తొలిమానవుని సంప్రదాయాన్నే వాళ్ళు అన్వయించు కుంటారు, మానవుణ్ని తిరుగబడిన కొంటెపిల్లవాడిగా, దారి తప్పిన వావిగా చిత్రిస్తారు. కాని వేదాంతదృష్టితో చూస్తే మానవునికీ ప్రకృతికీ పైరుధ్యంలేదు; మానవుడి అజ్ఞానమే, అహంకారమే అతణ్ని భగవంతుడి నుంచీ దూరం చేస్తున్నది. పాశ్చాత్యుల దృష్టిలో విధ్వంసం, ప్రళయం, విప్లవం అనేవి భగవంతుని కోపాలే మనిషికి శిక్షా లేకపోతే చరిత్రపోకడ (Process) వేదాంతదృష్టిలో అవి సృజనాత్మకశక్తి యొక్క నిత్య నూతన మైన విన్యాసం మాత్రమే. వేదాంతదృష్టిలో చరిత్ర ఋతువులకు మల్లే పునరావృత్తమౌతుంది. పాశ్చాత్యులకు చరిత్ర క్రమపరిణామంచెంది అంతమౌతుంది. మార్క్స్ కూడా చరిత్ర అంతాన్నే ఊహిస్తాడు.) “కొత్తపిల్లలు ఉదయిస్తారు. కొత్త గర్భాలకూ కొత్త విత్తనాలకూ కొ త్త కాంతివలయాలు విసిరే ముఖాలతో" కొత్త నాగరికతలల్లుతారు, చరిత్ర పేజీల కందిస్తారు, పేజీలు పెరుగుతుంటాయి. వాటిమీద నిర్దాక్షి ణ్యంగా కాలపు గండ్రగొడ్డలి పడేవరకూ" (మూడో సర) ఇది వేదాంత దృష్టి. చరిత్ర పునరావృతమౌతుందని వర్తమానంలో సమస్యల్ని ఉపే క్షించడం వేదాంతదృష్టికాదు. ఇది వివేకానందుడే నొక్కి చెప్పాడు నేటి సమస్యల్ని చిత్రించడంలో శర్మగారి కవిత్వం ఎన్నో కొత్తపోకడలు పోయింది. ఉక్తి వైచిత్రిని సాధించింది. "నీటి గాయాలు చెట్ల గాయాలు పైర్ల గాయాలు మీరు కనిపించవు. పొలాలూ నదులూ అరణ్యాలు వీరమరణం పొందిన ఆత్మలు" (ఆరో సర్గ) ఇది వాతావరణ కాలుష్యాన్ని (Pollution) గూర్చి సూపర్ ఎరువు లతో పండించిన పంటల్ని గూర్చి. “మీరు పలకా పుస్తకాలూ పట్టుకొనిపోతూంటేబాబూ : మీరు శిలువలు మోసుకుపోతున్న బాలక్రైస్తుల్లా కనిపిస్తారు నా కళ్ళకు" (ఆరో సర్గ) ఇది చదువునుగూర్చి. “మనుషులు తపస్సుచేసి ఒక పామును పుట్టించారు. విరివిగా ఓట్లనే ధాన్యపుగింజలు వేసి పెంచారు. ఆ పాము చట్టాలనే గుడ్లు సక్రమంగా పెడుతుంది" ఇది రాజకీయవ్యవస్థనుగూర్చి. ఏదో సర్గలో ప్రకృతి ఆధునిక మానవుని ఆర్భాటాన్ని ఒకకంట కనిపెడుతోంది అంటాడు కవి : "గాలిలో విమానంతో పోటీపడుతున్న ఆ పక్షి వట్టిపక్షి అను కోకు, అది నీలి ఎత్తులమీద కూర్చుని లేస్తూ పడుతూ నడిచే మానవ నాగరకతల్ని పరికిస్తున్న ప్రాచీనపక్షి... (ఏడో సర్గ) ఇక్కడ ఉపనిషత్తులోని రెండు పక్షులూ స్ఫురిస్తాయి. ఒకటి అహంత. రెండోది ఆత్మ. సమిష్టి మానవుని అహంక విన్యాసమే ఈ నాగరకత. దీన్ని పరికిస్తున్న సాక్షి ప్రకృతి. ప్రకృతి అంటే మానవుని అంతర ప్రకృతి కూడా. నాగరికత చెడినా ఆత్మవినాశం లేదు మనిషికి అనే విశ్వాసమే ఈ కావ్యం చివర వ్యక్తమైంది. ఎనిమిదో సర్గలో ప్రసక్తమైన ప్రేమ - కవీ అతని గీతికా మనిషీ ప్రకృతీ, సూర్యుడూ భూమి, ప్రియుడూ ప్రేయసీ, సృష్టికర్తా సృష్టి - వీళ్ళమధ్య ఉండే సంబంధమే ప్రేమ. "నా దేశం నా ప్రజలు అనుభవిస్తున్న బాధల గాధలు రాన్ని వ్యధాస్వరఝరీ వేగంతో ప్రతిధ్వనింపజేస్తున్నాయి. కానీ నీరక్త నాళాలు ఒరసిపారే గంభీరశాంతరసమే, వాక్రోధోన్మత్త ఉత్తమాశ్వాలకు కళ్ళెం వెయ్యగలిగింది" అంటారు సూర్యునితో భూమి, సృష్టికర్తతో సృష్టి, కవితో అతని హృదయం. అందుకే ప్రేమ నశించినంత కాలం, మానవత్వమూ నశించదు. రెండూ సమానార్థకాలు. అదే కావ్యం చివర ప్రవచనం – “ప్రేమ అగాధపు లోతుల్లో మానవ పదవీ గౌరవాన్ని పొందాను". అంటాడు. ఎవరు ? కవి, విప్లవకారుడు, భగవంతుడు. అన్నీ ఒక్కడైన మానవుడు. 'నా దేశం - నా ప్రజలు' వచన కవిత్వంకాదు. ప్రవచన కవిత్వం. ఎత్తుగడలో, శిల్పంలో, దృక్పథంలో, ఇతివృత్తంలో, నిర్మాణసౌక వంలో విలక్షణమైన నూత్నసృష్టి. ఈ కావ్యంతో తెలుగు కవిత్వం ఒక మలుపు తిరిగిందని చెప్పడం తొందరపాటు కాదనుకుంటాను. 'కృష్ణపక్షం’ భావకవితకూ, “మహాప్రస్థానం' అభ్యుదయ కవితకూ వేగుజుక్కలైనట్లే 'నా దేశం - నా ప్రజలు' తెలుగు కవిత్వాన్ని కొత్తదారుల్లో నడిపిస్తుందని నాకు తో స్తుంది. భారతి తెలుగు మాస పత్రిక ఫిబ్రవరి 1976 - - - నూరు సమీక్షలు పుస్తక సమీక్షల సంకలనం : ఆర్ .ఎస్ సుదర్శనం : జనవరి 1987 - ----------- శేషేంద్ర శర్మ (20-10-1927 - 30-5-2007) సంస్మరణ ప్రముఖ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ (79) మే 30 రాత్రి మరణించారు. ఆయన 1927లో నెల్లూరులో తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ పనిచేశారు. 'నా దేశం నా (ప్రజలు' ‘శేషజ్యోత్స్న’, ‘రక్తరేఖ', 'గొరిల్లా', 'ఆధునిక మహాభారతం', 'జనవంశం', “రుతుఘోషు', 'మండేసూర్యుడు', 'స్వర్ణహంస', 'రామాయణ రహస్యాలు' వంటి రచనలు చేశారు. 'కవిసేన మేనిఫెస్టో ఆయన సుప్రసిద్ధ రచన. ఆయన సాహిత్యకృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. కవిత్వం, సాహిత్య విమర్శ ఇతర వచన రచనలన్నీ కలిపి 40కి పైగా పుస్తకాలు వచ్చాయి. ధన్జ్గరి సాహచర్యంతో రాణివాసానికి వెళ్ళి సాహిత్య సామ్రాట్గా మారినట్లు కనిపించినా, ఆయన చివరి దాకా ఎస్టాబ్లిష్మెంట్కు దూరంగానే ఉన్నారు. ఉద్యోగం తొలిరోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని ఐ.వి. సాంబశివరావుతో కలిసి నిర్మాణం చేసి కమ్యూనిస్టుగా ముద్రపడి ఆయనను నిర్బంధ పదవీ విరమణకు గురిచేసింది. 1955 ఆంధ్రా ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీవైపు నిలబడిన శ్రీశ్రీ దాదాపు మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఆయనకు అండగా కవిత రాసి ఓటమి తాత్కాలికమే అని ప్రోత్సహించిన కవి శేషేంద్ర. ఇంక 1991 నుంచి గల్ఫ్ యుద్ధాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని స్థిరంగా వ్యతిరేకించిన శేషేంద్ర 'నీతులు చెప్పే అమెరికా ఇదీ నీ చరిత అని వ్యాస సంపుటివెలువరించారు. ఆయన మరణానికి "వీక్షణం” తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. వీక్షణం రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక జూలై 2007 --------- సహస్రాబ్ది దార్శనిక కవి కవిర్విశ్వో మహాతేజా
“ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం) ఆంధ్ర భువిని అత్యున్నతంబైనయట్టి ------------- కత్తులుగా మొలిచిన శేషేంద్ర మాటలు మానవత్వం పరిమళించే తోటలై, యువశక్తిని నవయుగం వైపుకు నడిపించే బాటలై, సారస్వత విలువలను సంరక్షించే దుర్భేద్యమైన కోటలై ఈ శతాబ్ది చైతన్య స్రవంతిలో అంతర్లీనమయ్యాయి. ఇదీ శేషేంద్ర సంకల్పం. ఇదీ శేషేంద్ర స్వామ్యవాద సాహిత్య శిల్పం……… * * * అక్టోబర్ తర్వాత విప్లవంతో పెనవేసుకున్న మరో నెల మే . అదే మే డే ! కాకతాళీయంగా శేషేంద్ర నిర్యాణం మే నెలలోనే. అలా జనన మరణాలను అనూహ్యంగా విప్లవంతో అనుసంధానం చేసుకున్న కాలజ్ఞులు శేషేంద్ర.. - -- డా.వెనిగళ్ళ రాంబాబు - సినీ గీత రచయిత - ------------- అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర “గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.” ఆచార్య | |||||||||||||||||